సైకిల్-క‌మ‌లం నాయ‌కుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp bjp leaders
Updated:  2018-04-09 05:23:04

సైకిల్-క‌మ‌లం నాయ‌కుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర అభివృద్ది కోసం నాలుగు సంవ‌త్స‌రాలు ఎన్డీఏతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.... అయితే కొద్ది రోజుల క్రితం కేంద్రం ఏపీ విభ‌జ‌న హామీల్లో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా రైల్వే జోన్ వంటి అంశాల‌ను ప్ర‌క‌టించ‌డం కుద‌ర‌దు అని తేల్చి చెప్ప‌డంతో టీడీపీ నాయ‌కులు ఎన్డీఏతో మిత్ర ప‌క్షంనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది... దీంతో వార్ వ‌న్ సైడ్ కాస్త టూ సైడ్ కావ‌డంతో ఒక‌రిపై ఒక‌రు కొద్ది రోజులుగా మాట‌లు తూటాలు పేల్చుకుంటున్నారు.
 
అయితే ఇప్ప‌టికే  బీజేపీ నాయ‌కుడు సోము వీర్రాజు టీడీపీ నాయ‌కుల‌పై వారి ప‌రిపాల‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.. ఇక తాజాగా తిరుప‌తిలో కూడా టీడీపీ బీజేపీ నాయ‌కుల మ‌ధ్య లోక‌ల్ వారు జోరుగా న‌డుస్తోంది... తిరుపతి రూరల్‌ మండలంలోని చెర్లోపల్లిలో బీజేపీ జెండాను ఆవిస్క‌రించ‌డానికి సిద్ద‌మ‌య్యారు ఎన్డీఏ నేత‌లు... అయితే వీరి జెండా ఆవిస్క‌ర‌న‌ను తెలుగు దేశం పార్టీ నాయ‌కులు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు.. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు విభ‌జ‌న హామీల‌ను అమ‌లు ప‌ర‌చ‌లేని కేంద్ర ప్ర‌భుత్వం ఏపీలో ఎక్క‌డా కూడా బీజేపీ జెండాను ఆవిష్క‌రించ‌కూడ‌ద‌ని టీడీపీ నాయ‌కులు వారితో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు..ఒక‌వేల ఆవిష్క‌రిస్తే  ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కానీ ఎంపీలు కాని ఆవిష్క‌రించాల‌ని కోరారు.. అంతేకాని బీజేపీ కార్య‌క‌ర్త‌లు జెండాను ఆవిష్క‌రిస్తే అడ్డుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ నాయ‌కులు... దీంతో వారి మ‌ధ్య మాట‌ల యుద్దం చోటుచేసుకోవ‌డంతో వెంట‌నే అక్క‌డికి పోలీసులు చేరుకుని వారికి స‌ర్ది చెప్పి పంపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.