కొత్త సర్వే జ‌గ‌న్ ర్యాంకు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-17 14:57:45

కొత్త సర్వే జ‌గ‌న్ ర్యాంకు...

రాష్ట్రంలో ఎటువంటి స‌ర్వే విడుద‌ల అయినా రాజ‌కీయంగా ఆలోచ‌న‌ల‌ను పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతోంది.. ఇక 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా స‌ర్వేలు వ‌స్తున్నాయి.. ఇప్ప‌టికే ఏపీపై ప‌లు స‌ర్వేలు వెల్ల‌డ‌వుతూనే ఉన్నాయి ...రాష్ట్రంలో ప్ర‌ముఖ ప‌ల్స్ సంస్ద‌లు అలాగే జాతీయ స‌ర్వే బృందాలు ఏపీ ఓట‌రు నాడిపై స‌ర్వేలు చేస్తూనే ఉన్నాయి..
 
అయితే 2014 ఎన్నిక‌ల కంటే ఈ ఎన్నిక‌లు ట‌ఫ్ వార్ గా క‌నిపిస్తోంది.. నాడు తెలుగుదేశానికి బీజేపీ జ‌న‌సేన మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.. ఇప్పుడు జ‌న‌సేన బీజేపీ టీడీపీ నుంచి బ‌య‌టకు వ‌చ్చాయి..  తెలుగుదేశం ఒంటరి పోరుకు రెడీ అవుతోంది.. మ‌రో ప‌క్క బీజేపీ జ‌న‌సేన కూడా ఇండివిడ్యువ‌ల్ గా ఎద‌గాల‌ని ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ఉత్సుక‌తో ఉన్నాయి.
 
ఇప్ప‌టి వ‌ర‌కూ ఎటువంటి స‌ర్వేలు ఫ‌లితాలు వెల్ల‌డి అయినా, ఏపీపై ప‌లు జాతీయ స‌ర్వేలు నిర్వ‌హించినా ఏపీలో వ‌చ్చే ఎన్నికల్లో జ‌గ‌న్ ముఖ్యమంత్రి అవుతారు అని తెలియ‌చేస్తున్నాయి.. అలాగే ఆ స‌ర్వేలు తెలిపిన దాని ప్ర‌కారం వారి వారి సీట్ల లెక్క‌లు మారుతున్నాయి కాని జ‌గ‌న్ కు మెజార్టీ ప‌ట్టం క‌డుతున్నాయి ప్ర‌జా ప‌ల్స్ ఆ విధంగా తెలియ‌చేస్తున్నారు.
 
ఇక తాజాగా ఓ తెలుగు వెబ్ జోన‌ర్ ఏపీ రాజ‌కీయాల పై స‌ర్వే నిర్వ‌హించారు..  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు సీఎం అవుతారు అని  అయితే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు ఈస‌ర్వేలో కూడా... 2019 ఎన్నికల తర్వాత జగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని 40. 33 శాతం మంది నెటిజనులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడికి 33.74 శాతం మంది మద్దతిచ్చారు.... ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని 25.92 శాతం మంది అభిప్రాయపడ్డారు. జ‌గ‌న్ పాద‌యాత్ర లో ఉన్న స‌మ‌యం అలాగే మార్చిలో చేసిన స‌ర్వేగా ఇది తెలుస్తోంది... 
 
మొత్తానికి ప‌లు సెగ్మెంట్ల‌లో తెలుగుదేశం పై వ్య‌తిరేక‌త ప‌తాక‌స్ధాయికి పెరిగింది అనే చెప్పాలి ...ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొద‌టి నుంచి ప్ర‌త్యేక హూదా పై ఒకే విధానంతో ఉన్నారు  అందుకే జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం మ‌రింత పెరిగింది అంటున్నారు ఏపీ ప్ర‌జ‌లు... అందుకే ఈ స‌ర్వే ఫ‌లితాల పై ప్ర‌జ‌లు మ‌రింతగా చర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.