అడ్డాగా మారిన మ‌రో జిల్లా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:26:08

అడ్డాగా మారిన మ‌రో జిల్లా

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంకల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాలు కోస్తాలోని నాలుగు జిల్లాల‌ను పూర్తి చేసుకుని  ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో ఇదే జిల్లా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మార‌నుందా! అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.
 
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిధిలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే గ‌డిచిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ జిల్లా త‌ర‌పున‌ వైసీపీ ఒక్క సీటు గెలువ‌లేదు. వాస్త‌వానికి క‌డ‌ప జిల్లా త‌ర్వాత ఈ జిల్లా నుంచే అధిక సీట్లు వ‌స్తాయ‌ని వైఎస్ జ‌గ‌న్ ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నారు. కానీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని తిప్పికొట్టారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఈ జిల్లా నుంచి పట్టు సాధించాల‌నే ఉద్దేశ్యంతో అహ‌ర్ణిశ‌లు కృషి చేస్తున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కూడా కొద్ది రోజుల క్రితం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చేరుకుంది. సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఈ జిల్లాలో మ‌రో రికార్డును సాధించారు. తాను చేప‌ట్టిన పాద‌యాత్ర రెండు వేల కిలోమీర్ల‌ను పూర్తి చేసుకుంది. ఇక ఈ శుభ సంద‌ర్భంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు కూడా ఎంతగానో సంతోషించి పైలాన్ ని ఆవిష్కరించారు.
 
ఏ నాయ‌కుడుకి చూపించ‌నంత విధంగా జ‌గ‌న్ కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు ఆద‌ర‌ణ చూపుతున్నారు. ఇక ఈ ఆద‌ర‌ణ‌ను బ‌ట్టి చూస్తుంటే 2019 సార్వ‌త్రిక ఎన్నిల్లో  క‌చ్చితంగా వైసీపీ అధిక సంఖ్య‌లో మెజార్టీ స్థానాల‌ను సంపాదించుకుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలుపుతున్నారు.దీనికి కార‌ణం కూడా ఉంది.
 
ప‌శ్చిమ గోదావరి అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే మాట ప‌చ్చ‌ని పైర్లు, విశాల‌మైన వాత‌వ‌ర‌ణం కానీ టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డు మీద హ‌త్య‌లు జ‌రిగాయి. దీంతో బెంబేలెత్తిపోయిన ప్ర‌జ‌లు హత్యా రాజకీయాలను ప్రోత్సహించే తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో ఇంటికి పంపించాలి అనుకుంటున్నారు పశ్చిమ గోదావ‌రి వాసులు.
 

షేర్ :

Comments

1 Comment

  1. imam basha shaik

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.