ప‌శ్చిమ‌లో పెరిగిన త‌మ్ముళ్ల విభేదాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-12 04:56:20

ప‌శ్చిమ‌లో పెరిగిన త‌మ్ముళ్ల విభేదాలు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ  కంచుకోట ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య గ్రూపు రాజ‌కీయాలు ర‌చ్చ‌బండ‌కు ఎక్కుతున్నాయి. ఎక్స్ఎంజ్ శాఖ మంత్రి జ‌వ‌హ‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ విభేదాలు రోజురోజుకు ముదురుతూనే ఉన్నాయి. ఇటీవ‌లే  కొవ్వూరు మండ‌లం వాడ‌ప‌ల్లిలో ఎన్టీఆర్ సామూహిక గృహ ప్ర‌వేశాల స‌మ‌యంలో నిర్వ‌హించిన అధికారికి స‌మావేశంలో ప్రోటోకాల్ పాటించ‌లేదంటూ MPP అధ్య‌క్షురాలు రాజ్య‌ల‌క్ష్మీ జిల్లా క‌లెక్ట‌ర్ కు పార్టీ అధిష్టానానికి బ‌హిరంగంగానే లేఖ రాయ‌డం అధికార పార్టీలో చ‌ర్చ‌నీయాంశం అయింది. 
 
బీసీ మ‌హిళ అయినందున త‌న‌కు పార్టీ నేత‌లు అధికారులు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేదంటూ లేఖ‌లో  ఆరోపించ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రోటో కాల్ వివాదం రోడ్డెక్క‌డంతో పార్టీ నేత‌లు ఆమెను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ విభేదాలు ఆరు నెల‌ల క్రిత‌మే బ‌య‌టప‌డ్డాయి. 
 
కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలోని చాగ‌ల్లు ZPTC విక్ర‌మాదిత్య వ‌ర్గానికి మంత్రి వ‌ర్గానికి మ‌ధ్య కొద్దికాలంగా గ్యాప్  వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మంత్రికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశార‌ని ఇద్ద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై మంత్రి పీఏ పోలీస్టేష‌న్లో ఫిర్యాదు చేయ‌డంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఈ వ్య‌వ‌హారం మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్ల‌డం ఆయ‌న సూచ‌న మేర‌కు ఇంటికి వ‌చ్చిన కార్యక‌ర్త‌ల‌పై మంత్రి జ‌వ‌హ‌ర్ చేయి చేసుకోవ‌డం ఇక అదికాస్త పోలీస్టేష‌న్ వ‌ర‌కు వెళ్ల‌డంతో జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. అంతేకాదు మంత్రికి వ్య‌తిరేకంగా ర్యాలీలు నిర‌స‌న‌లు కొన‌సాగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.
 
ఆ త‌ర్వాత జ‌రిగిన‌ మినీ మ‌హానాడుకు త‌న‌కు ఆహ్వానం అంద‌క‌పోవ‌డానికి మంత్రి జ‌వ‌హ‌రే కార‌ణం అని ZPTC విక్ర‌మాదిత్య గుర్రుగా ఉన్నారు. అంతేకాదు నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దదిక్కుగా ఉన్న అచ్చిబాబును సైతం మినీ మ‌హానాడుకు ఆహ్వానించ‌క‌పోవ‌డానికి వ‌ర్గ విభేదాలే కార‌ణం అని తెలుస్తోంది. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే టీజీ రామా రావును మినీ మ‌హానాడులో వేదిక పైకి ఆహ్వానించ‌క‌పోవ‌డానికి కూడా వివాదాస్ప‌దం అయింది.
 
ఇక మ‌రో వైపు కొవ్వూరు మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ వ్య‌వహారం కూడా ర‌చ్చ‌గా మారింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో చైర్మ‌న్ ప‌ద‌వి రెండెళ్లు వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి మూడేళ్లు చొప్పున అంగీక‌రించార‌ట‌.  అందులో భాగంగానే మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వినుంచి సూర‌ప‌నేని చిన్ని రాజీనామా చేయ‌డంతో జొన్న‌ల గ‌డ్డ రాధ‌రాణి చైర్మ‌న్ గా రెండేళ్ల క్రిత‌మే బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. 
 
ఇక ఒప్పంలో భాగంగా దుద్దుపుడి రాజా ర‌మేష్ కూడా గ‌త ఏడాదే రాజీనామా చేయాల్సి ఉంది. అయితే వైస్ చైర్మ‌న్ కు మంత్రి జ‌వ‌హ‌ర్ మ‌ద్ద‌తుగా ఉండ‌టంతో రాజీనామా చేయ‌క‌పోవ‌డంపై కౌన్సిల‌ర్లు సీరియ‌స్ గా ఉన్నారు. వైఎస్ చైర్మ‌న్ పై అవిశ్వాసానికి సొంత కౌన్సుల‌ర్లు సిద్ద‌ప‌డ‌టం చ‌ర్చ‌గా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.