ప‌శ్చిమ‌లో ఆ సీన్ రిపీట్ అవ్వ‌దు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-06 18:34:49

ప‌శ్చిమ‌లో ఆ సీన్ రిపీట్ అవ్వ‌దు

గ‌త ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పు జ‌గ‌న్ చేయ‌కూడ‌దు అని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప్ర‌తీ వైసీపీ కార్య‌క‌ర్త ,నాయ‌కుడు అనుకుంటున్నారు.. 2014 ఎన్నిక‌ల్లో  చివ‌రి నిమిషంలో వైసీపీ నాయ‌కుల‌ను గుర్తించి వారికి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు జ‌గ‌న్.. దీంతో 15 అసెంబ్లీ సీట్ల‌లో విజ‌యం దూరం వెళ్లింది... చివ‌ర‌కు అప‌జ‌యం వ‌చ్చింది. ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ కు జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు.
 
జిల్లాలో 80 శాతం సెగ్మెంట్ల‌లో ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కొన‌సాగుతోంది. అయితే నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి అభివృద్ది, జిల్లాకు చేయ‌లేదంటూ నిల‌దీస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి... అలాగే ప‌లు సెగ్మెంట్ల‌లో ఇప్ప‌టికే  జ‌గ‌న్ అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించారు.. ఇది పార్టీకి మ‌రింత ప్ల‌స్ అయింది అని చెప్పాలి... ప్ర‌శాంత్ టీం  కూడా ఇదే అంశం పై ప్ర‌జ‌ల నాడిని తెలుసుకుంది. ఇందులో జ‌గ‌న్ స‌త్ఫ‌లితం పొందాడు అనే చెప్పాలి.
 
జిల్లాలో నాలుగేళ్లుగా ఎంద‌రు క‌ష్ట‌ప‌డ్డారో అంద‌రిని గుర్తించి జ‌గ‌న్ వారికి ప‌ద‌వులు ఇస్తున్నారా, వారికి కాకుండా వేరే వారికి ఇక్క‌డ సీట్లు ఇస్తున్నారా అంటే జ‌గ‌న్ ప‌ర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు అని జిల్లా నాయ‌కులు అంటున్నారు..ఏలూరు ఎంపీ సీటు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్‌ను ఇప్ప‌టికే  జ‌గ‌న్ ప్ర‌క‌టించి అక్కడ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.. గ‌త ఎన్నిక‌ల్లో తోట చంద్ర‌శేఖ‌ర్ కు సీటు ఇచ్చినా ఆయ‌న అప‌జ‌యం పాల‌య్యారు. దీంతో సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్లు లెక్క‌వేసిన జ‌గ‌న్, ఇక్క‌డ సీటు పై త‌న నిర్ణ‌యం ముందే ఫిక్స్ చేసుకున్నారు.
 
ఇక జిల్లా కేంద్రం కీల‌క ప‌ట్ట‌ణం ఏలూరు, ఇక్క‌డ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల‌నానికి జ‌గ‌న్ ఎమ్మెల్సీ అవ‌కాశం ఇచ్చారు. దీంతో ఆళ్ల జిల్లాలో పార్టీ త‌ర‌పున కొన‌సాగుతున్నారు... ఇక ఏలూరు అసెంబ్లీ సీటు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ మ‌ధ్యాహ్న‌పు ఈశ్వ‌రీ బ‌ల‌రాంను నియ‌మించారు.. ఈ సీటు ఈశ్వ‌రికి అని ఇప్ప‌టికే బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక జిల్లాలో 15 సెగ్మెంట్ల‌లో నాలుగు సెగ్మెంట్లు ఇప్ప‌టికీ వీక్ అనే వార్త‌లు వ‌స్తున్నాయి.. మంత్రి జ‌వ‌హర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రాంతం కొవ్వూరు ఇక్క‌డ వైసీపీ బ‌లంగా మారాలి, మాజీ మంత్రి పీత‌ల‌సుజాత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రాంతం చింత‌ల‌పూడి ఇక్క‌డ కూడా అభ్య‌ర్దులు మారుతున్నా పార్టీ స్టేచ‌ర్ మార‌డం లేదు, ఇక మ‌రో సెగ్మెంట్  గోపాల‌పురం, ఇక్క‌డ కూడా వైసీపీ జెండా రెప‌రెప‌లాడ‌టానికి కాస్త క‌ష్ట‌ప‌డాల్సిందే.
 
ఇక పాల‌కొల్లులో ప‌రిస్దితి స‌స్పెన్స్ గానే ఉంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు గుణ్ణంనాగ‌బాబుకే అని జ‌గ‌న్ చెబుతున్నా పాద‌యాత్ర‌లో ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.. ఇటు మాజీ ఎమ్మెల్సీ జ‌గ‌న్ కు జిల్లాలో మ‌రో న‌మ్మ‌క‌స్తుడు మేకా శేషుబాబు కూడా ఆ రేసులో ఉన్నారు.. ఇటు బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ బాబ్జీ కూడా వైసీపీలో చేరితే ఆయ‌న‌కు సీటు ఇస్తారా అనే కొత్త వార్త‌లు ఈమ‌ధ్య పాద‌యాత్ర‌లో వినిపించాయి.. ఇటు హ‌రిరామ‌జోగయ్య వార‌సుడు సూర్య‌ప్ర‌కాశ్  కూడా క్యూలో ఉన్నారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
ఇక గ‌త ఎన్నిక‌ల్లో త‌ణుకులో చీర్ల రాధ‌య్య పోటీ చేసి ఆరిమిల్లి పై ఓట‌మి పాల‌య్యారు.. ఇప్పుడు ఇక్కడ కారుమూరి నాగేశ్వ‌ర‌రావు బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు కారుమూరి కూడా కాస్త క‌ష్ట‌ప‌డితే విజ‌యం సుల‌భ‌మే,  ఇటు న‌ర‌సాపురం ముదునూరికి ఫిక్స్ చేశారు.. ఇక ఆచంట శ్రీరంగనాథ‌రాజు కు సీటు ఫిక్స్ చేసి క‌వురు శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ అనే ఆఫ‌ర్ ప్ర‌జ‌ల ముందే ఇచ్చారు జ‌గ‌న్ .
 
అలాగే గ‌త ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన వంక ర‌వీంద్ర లేదా ఆయ‌న స‌తీమ‌ణి రాజ‌కుమారి అయినా న‌ర‌సాపురం ఎంపీగా మ‌రోసారి  పోటీ చేయ‌వ‌చ్చంటున్నారు.. అలాగే .తాడేప‌ల్లిగూడెంలో ప్ర‌స్తుతం మాజీ ఎమ్మెల్యే కొట్టు స‌త్య‌నారాయ‌ణ పేరు వినిపిస్తున్నా ఆయ‌న రేసులో ఉంటారా లేదా వేరే వారు వ‌స్తారా అని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇటు దెందులూరులో అబ్బ‌య్య చౌద‌రి త‌న దూకుడు చూపిస్తూ ముందుకు వెళుతున్నారు. జ‌గ‌న్ సీటు కూడా ఫిక్స్ చేయ‌డంతో చింత‌మ‌నేనిపై ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జ‌ల్లో మ‌రింత పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నారు.ఇటు ఉండిలో  న‌ర్సింహ‌రాజు  గెలుపు సుల‌భం అని అంటున్నారు, ఇప్ప‌టికే ఉండి అంతా ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు.. ఇటు మ‌రో కీల‌క‌మైన సెగ్మెంట్ భీమ‌వ‌రం ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు జ‌గ‌న్ సీటు ఇవ్వ‌డం ఇక్క‌డ ప్ర‌జ‌లు జిల్లాలో అత్య‌ధికంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు త‌ర‌లి వ‌చ్చారు. దీంతో గ్రంధి త‌న పొలిటిక‌ల్ రేంజ్ చూపించారు. మొత్తానికి జ‌గ‌న్ ఓ సంవ‌త్స‌రం ముందే ప‌లు సెగ్మెంట్ల‌లో  అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించ‌డంతో జిల్లాలో జ‌గ‌న్ ప్లాన్ స‌క్సెస్ అంటున్నారు వైసీపీ శ్రేణులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.