బాబు హైదరాబాద్ కు ఏం చేయ‌లేదా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 12:59:33

బాబు హైదరాబాద్ కు ఏం చేయ‌లేదా

హైద‌రాబాద్ తానే నిర్మించా డ‌వ‌ల‌ప్ చేశా అని చెబుతారు సీఎం చంద్ర‌బాబు. ఇక కొత్త పేట నుంచి పటాన్ చెరువు వ‌ర‌కూ బాబు ముద్ర ఉంది అని హైద‌రాబాద్ లో చెబుతారు తెలుగుత‌మ్ముళ్లు. అంతేకాదు ఇటీవ‌ల కేంద్ర‌ప్ర‌భుత్వ సంస్ద‌లు కంపెనీలు కూడా మా  బాబే ఎక్కువశాతం హైదరాబాద్  తీసుకువ‌చ్చారు అని చెబుతారు.. అయితే తొమ్మిదేళ్ల బాబు పాల‌న‌లో హైద‌రాబాద్ లో బీహెచ్ ఈఎల్ ఎంతో డ‌వ‌ల‌ప్ చేశాం అంటారు. అయితే ఓ సారి తెలుసుకుందాం ఆ చ‌రిత్ర‌.
 
ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మ‌హాన‌గ‌రం అదే విశ్వ‌న‌గ‌రం అన‌గానే మ‌న‌కు హైదరాబాద్  అని చెబుతారు తెలుగు ప్ర‌జ‌లు. ఇక్క‌డ  మొదటి అతిపెద్ద కంపెని BHEL అనేది తెలిసిందే.  అప్పటి ప్రధాని,లాల్ బహుదూర్ శాస్త్రి ఈ కంపెనీకి  పునాది వేశారు. చెకొస్లొవేకియాకి చెందిన TechnoExport అనే కంపెనీ  సహాయం తీసుకున్నారు ఆనాటి పెద్ద‌లు.
 
ఓ సారి ఆ సంస్ద గురించి తెలుసుకుంటే BHEL హైదరాబాద్ కి 1959 లొ భూమి పూజ జరిగింది,1965 నుండి ఉత్పత్తి ప్రారంభించింది ఈ సంస్ద‌.. అలాగే BHEL కంపెని 6 దశల్లొ అభివృద్ది చెందింది అనే చెప్పాలి.
 
ఫేజ్ 1 : 1959-1970
 
ఫేజ్ 2 : 1971-1978
 
ఫేజ్ 3 : 1979-1985
 
ఫేజ్ 4 : 1985-1991
 
ఫేజ్ 5 : 1992-2002
 
ఫేజ్ 6 : 2003-2012
 
హైదరాబాద్ అభివృద్దికి అంకురార్పణ జరిగిన 1959 కాలంలొ చంద్రబాబు ఎవరు అనేది మీరే తెలుసుకోవాలి.. ఇక ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే ఇక్క‌డ అభివృద్ది సంస్ద ఎదుగుద‌ల జ‌ర‌గ‌లేదు. ఈ ఆరు ఫేజ్ లో అనేక అభివృద్ది జ‌రిగింది... ఇక ఫార్మా రంగం కూడా ఇక్క‌డ అన్ని ప్ర‌భుత్వాల‌లో అభివృద్ది చెందుతూ వ‌చ్చింది. కేవ‌లం బాబుగారు అధికారంలో ఉన్న‌ప్పుడే పెద్ద‌పెద్ద కంపెనీలు ఇక్క‌డ ఏమీ స్ధాపించ‌లేదు. అన్నీ స‌ర్కారులు పారిశ్రామికీక‌ర‌ణ‌కు ఊతం ఇచ్చాయి. అలాగే ఫార్మాలో విశాఖ కూడా త‌న స‌త్తా చాటింది అనే చెప్పాలి.
 
ఇక తెలుగుదేశం నాయ‌కులు అంద‌రూ ఇప్ప‌టికీ చెప్పేమాట హైటెక్ సిటీ పేటెంట్ రైట్స్ మావే అంటారు. మీ స‌మ‌యంలో క‌ట్టారు కాబ‌ట్టి రైట్స్ కాదు ఆ క్రెడిట్ తీసుకోండి అని రాజ‌కీయ నాయ‌కులు చెబుతారు. అక్క‌డితో ఆగ‌కుండా సాఫ్ట్ వేర్ ప‌రిశ్ర‌మ నావ‌ల్లే హైద‌రాబాద్ వ‌చ్చింది అంటే మాత్రం ఎవ‌రూ ఊరుకోరు. హైదరాబాద్ లొ సాఫ్ట్ వేర్ రంగం అభివృద్దికి ప్రధాన  కారణం ఇక్కడ వాతావరణం,కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి అని ప్ర‌ధ‌మంగా చెబుతారు.
 
ఇక ప్ర‌పంచంలోనే ఎంతో పేరు గాంచిన సాఫ్ట్ వేర్ దిగ్గ‌జం మైక్రొసాఫ్ట్  హైదరాబాద్ లో తమ శాఖను ఏర్పాటు చెయ్యటానికి ముందు,బెంగుళూరు ను పరిశీలించింది. అయితే అక్క‌డ జీతాలు,వ్యయం హైదరాబాద్ లొ కన్నా 40% ఎక్కువ ఉన్నాయి అని వారు ఆలోచించారు.  త‌ర్వాత వారు హైదరాబాద్ ను  ఎంపిక చేశారు
 
మైక్రొసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చే సమయంలొ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే తప్పితే,చంద్రబాబును చూసి ఇక్క‌డ‌కు కంపెనీ రాలేదు అని అనేక సార్లు నాయ‌కులు చెప్పారు.  ఆయ‌నను చూసి హైద‌రాబాద్ కు వ‌చ్చింది అని అనుకుంటే?అమ‌రావ‌తికి విజ‌య‌వాడ‌కు, విశాఖ‌కు, ఎందుకు రావ‌డం లేదు దీనికి  స‌మాధానాలు చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటారు.
 
కాంగ్రెస్ హాయాంలో వైయ‌స్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో సాఫ్ట్ వేర్ రంగం ఎంతో అభివృద్ది చెందింది.. స్టార్ట‌ప్ ల‌కు ఊతం వ‌చ్చింది. గచ్చిబౌలి,రాయదుర్గం,మణికొండ Y.S.R హాయాంలొ అభివృద్ది చెందాయి అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.