విజనరీ ఎవరిదీ బాబుదా? ఎన్టీఆర్ దా? రాజశేఖర్ రెడ్డి దా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu ntr ys
Updated:  2018-04-15 03:48:23

విజనరీ ఎవరిదీ బాబుదా? ఎన్టీఆర్ దా? రాజశేఖర్ రెడ్డి దా?

రాజకీయాలు అంటే నవతరం యువతకు గుర్తుకు వచ్చేది ముగ్గురు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు..వీళ్ళు ముగ్గురు ఎదో ఒక మార్క్ తో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు...
 
తెలుగు చిత్ర పరిశ్రమలలో ఎన్టీఆర్ ని దేవుడిగా కొలిచేవారు అభిమానులు... ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక ప్రభంజనంలా మారి చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి అయ్యారు...ఇచ్చిన మాటకు కట్టుబడి తెలుగు ప్రజల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్యపాన నిషేధం అంటూ ఎన్నో పథ‌కాలు పెట్టి, మొదటి 5 సంవత్సరాలలోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు...ఎన్టీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తన విజన్ తో ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ ని దించేశారు...ఆ తర్వాత ఎన్టీఆర్ ని ఎం చేసారో మన అందరికి తెలుసు.
 
రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే...మునిగిపోతున్న కాంగ్రెస్ నావను ఒంటి చేత్తో రెండుసార్లు గెలిపించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది..పాదయాత్రతో రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్న బాధను తెలుసుకొని, ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళ బాధలను తీర్చి వాళ్ళ గుండెల్లోకి వెళ్లిపోయారు...రాజశేఖర్ రెడ్డి నమ్మిన వాళ్ళ కోసం, ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా వెళ్లేవారు...2004 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గెలిచినా తర్వాత ప్రమాణస్వీకారం రోజే తొలి సంతకం ఉచిత కరెంటు ఫైల్ పై సంతకం చేసి కొత్త అధ్యయానికి నాంది పలికారు... అంతే కాకుండా ప్రజల కష్టాలను దగ్గర నుండి చుసిన రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు తో పాటు, 108 , 104 పేరుతో  కేవలం 5 నిముషాలలోనే ఉచితంగా అబులన్స్ సేవలను, విద్యార్థులు కోసం ఫి- రీయింబర్సుమెంట్ పధకాన్ని ప్రవేశపెట్టి అన్ని వర్గాల వారికీ అండగా ఉన్నారు...నీటి కొరత లేకుండా చేయాలని జలయజ్ఞం పథకాన్ని యుద్ధ ప్రతిపాదికిన మొదలుపెట్టారు. కులం, మతం,ప్రాంతాన్ని చూడకుండా ఎదో ఒక పథకంతో ప్రతి ఒక్కరికి ఎదో విధంగా లబ్ది చేకూరేలా చేసారు...దేశ చరిత్రలోనే నేను చేసిన అభివృద్దే నన్ను గెలిపిస్తుంది అని చెప్పి రెండవ సారి ఎన్నికలకు వెళ్లి గెలిచిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి... రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 100 రోజులలోనే ప్రజలను వదిలిపెట్టి వెళ్లిపోయారు...రాజశేఖర్ రెడ్డి ప్రజలను వదిలిపెట్టి వెళ్లిపోయారు కానీ ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు...
 
ఇక చంద్రబాబు మార్క్ రాజకీయానికి వస్తే, తన సొంత మామను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి, ఎన్నో అవమానాలకు గురి చేసి, ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన గొప్ప నేత చంద్రబాబు...ఇప్పటివరకు సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నపటికీ ప్రజలు గుర్తించుకునే ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టని ఘనత చంద్రబాబుది...జన్మభూమి కమిటీలతో కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టడం..రాష్ట్రానికి అన్ని నేనే చేశాను అని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకు మాములే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...అప్పుడు ఎన్టీఆర్ ని, 2014 లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారు..నేను నిప్పు, నాది విజనరీ అని చెప్పే చంద్రబాబు అవినీతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నింపారు...
 
ఇప్పుడు చెప్పండి కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కూడా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిలది విజనరీనా లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నపటికీ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టని చంద్రబాబుదా...కస్టపడి పార్టీని ముందుండి నడిపించి, పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లు గొప్ప, లేక ఎవరో పెట్టిన పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గొప్ప...
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.