చంద్రబాబు ఎవరా బలిపశువు?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-03 06:39:33

చంద్రబాబు ఎవరా బలిపశువు?

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు...ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఏ పార్టీకి క్రేజ్ ఉందొ చూసుకొని, ఆ పార్టీ ఆదరణను క్యాష్ చేసుకుంటాడని కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య అన్నారు...అప్పుడేమో మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని సంపాదించుకున్నారు...ఆ తర్వాత ఎన్నికలలో బీజేపీపైన సానుభూతి ఉండడంతో, 1999ఎన్నికలలో బీజేపీతో పోతు పెట్టుకొని అధికారాన్ని దక్కించుకున్నాడు...
 
2004 లో బీజేపీపైన వ్యతిరేఖత రావడంతో, ఇక ఈ జన్మలో బీజేపీతో పొత్తుపెట్టుకోము అని బీజేపీకి కటీఫ్ చెప్పి వామపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు...2009 లో తెరాసతో కలిసి ఎన్నికలకు వెళ్లి ఓటమిపాళ్ళయ్యారు...2014 ఎన్నికల్లో బీజేపీ హవా నడుస్తుండడంతో బీజేపీపైన చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి, బీజేపీ, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారాన్ని దక్కించుకున్నారు...
 
కేంద్రంలో ఉన్న ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఓటుకు నోటు కోసం నాలుగేళ్లు సంసారం చేసి, ఇప్పుడు విడాకులు ఇచ్చాం అని, చంద్రబాబు తప్పించుకోవడానికి బీజేపీని దోషిని చేసారని మండిపడ్డారు రామచంద్రయ్య... ఇక ఎన్నికలకు ఒక సంవత్సరం మాత్రమే ఉండడంతో తన స్వార్ధ రాజకీయాల కోసం మరో పార్టీని బలిపశువును చేయడానికి ఎదురుచూస్తున్నారని, అయితే ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబుతో కలిసి ఏ పార్టీ ముందుకు వెళ్ళదని చెప్పారు రామచంద్రయ్య

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.