చంద్ర‌బాబు పై ఈడి ద‌ర్యాప్తు చేస్తుందా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu image
Updated:  2018-03-28 06:33:37

చంద్ర‌బాబు పై ఈడి ద‌ర్యాప్తు చేస్తుందా?

ఏపీ ప్ర‌త్యేక‌హోదా అంశం రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామాలుచోటు చేసుకునేలా చేసింది అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అందులో ప్ర‌ధానంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీతో ఉన్న భాగ‌స్వామ్యానికి స్వ‌స్తి ప‌లకడం.  అంతేకాకుండా ఒక‌రి పై ఒక‌రు అవినీతి ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. చివ‌రికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం బీజేపీ జాతీయ‌ అధ్య‌క్షుడి పై, ఆయ‌న కుమారుడి పై అవినీతిని తేల్చాలంటూ మీడియా ముఖంగా విమ‌ర్శించారు. తాజాగా ప్ర‌ధాని మోదీ పై కూడా ఆరోప‌ణ‌లు చేశారు చంద్ర‌బాబు.
 
దీనికి ప్ర‌ధాని మోదీ స్పందిస్తే ఏపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల పై  సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పరా.. చంద్రబాబుపై ఉన్న ఒటుకు నోటు కేసును పూర్తి స్థాయి విచార‌ణ‌కు ఆదేశించే అవ‌కాశం ఉంది అనే  అనుమానాలు వ్య‌క్తం ఉన్నాయి.అయితే ఇప్పటికే మోడీ నిఘా సంస్థలు సీఎం చంద్రబాబుపై  మూడో క‌న్ను వేశాయ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన అనుమానాలు రేపుతోంది.  ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలతో కృష్ణానది స్వరూపాన్నే మార్చేస్తున్నారని జల సంరక్షణ ఉద్యమకారుడు రాజేంద్రసింగ్ ఏకంగా పీఎంఓకు ఫిర్యాదు చేశారు. ఆయన తన సహచరులు విక్రమ్ సోని, బొలిశెట్టి సత్యనారాయణ, అనుమోలు గాంధీతో కలిసి ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. నదికి ఇరువైపులా ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని రాజేంద్రసింగ్ ఆరోపించారు. రివర్ కన్సర్వేషన్ పేరుతో కృష్ణా నదీ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా ఈ అక్రమాలను గుర్తించినట్లు ఆయ‌న మోదీకి తెలిపారు.
 
కేంద్ర పర్యావరణ, గనులు శాఖలు, ఈడీ, సిట్ ఆన్ బ్లాక్ మనీ లాంటి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని రాజేంద్ర సింగ్ బృందం ప్రభుత్వాన్ని కోరింది. ఇసుక అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, నది పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. మరి ఈ ఫిర్యాదు ఆధారంగా పీఎంఓ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.  ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం మేర‌కే చంద్ర‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
 
 

షేర్ :

Comments

1 Comment

  1. one of the best news website

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.