పీఠాధిప‌తి ఆస‌క్తిక‌ర జోస్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 04:29:52

పీఠాధిప‌తి ఆస‌క్తిక‌ర జోస్యం

మెగాస్టార్ చిరంజీవి, ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై విశాఖ‌ప‌ట్నం జిల్లా పెందుర్తికి చెందిన మ‌హా కామేశ్వ‌ర పీఠం అధిప‌తి య‌ద్ద‌న‌పూడి అయ్య‌న్న పంతులు ఆస‌క్తిక‌ర జోస్యం చెప్పారు. ప్ర‌జారాజ్యం పార్టీతో చిరు, జ‌న‌సేన పార్టీతో ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.
 
చిరు, ప‌వ‌న్ లు  రాజ‌కీయాల్లోకి రావ‌డం కార‌ణంగా అధికార పార్టీల‌కే న‌ష్ట‌మ‌ని  అయ్య‌న్న పంతులు అభిప్ర‌య‌ప‌డ్డారు. సినిమా రంగానికి సంబంధించిన వారు రాజ‌కీయాల్లోకి వ‌స్తే మ‌రో పార్టీ అధికారంలోకి వ‌స్తుందని జోస్యం చెప్పారు పంతులు. 
 
అంతేకాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌కు కాలస‌ర్ప‌దోషం ఉంద‌ని పంతులు అన్నారు. మ‌రి గ‌తంలో స్వ‌ర్గీయ ఎన్టీరామారావు సినిమా రంగానికి చెందిన‌వారే క‌దా....కాంగ్రెస్ పార్టీ గోడ‌లు కూల్చి తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేసిన సంగ‌తిని పంతులు మ‌రిచిపోయిన‌ట్లున్నారు. 
 
అయినా ఇప్పుడు రాజ‌కీయ పరిణామాల‌ను చూస్తే... నిజంగానే  తెలుగు రాష్ట్రాల‌కు దోషం ఉంద‌నే అనుమానం  రాక మాన‌దు. మ‌రి ప‌వ‌న్ కళ్యాన్ కారణంగా 2019 ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తుందో  చూడాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.