మే 5న వైసీపీలో చేరుతా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 17:52:53

మే 5న వైసీపీలో చేరుతా

వ‌రుస పెట్టి తెలుగుదేశం బీజేపీ నాయ‌కులు వైసీపీ పంచ‌న చేరుతున్నారు.... వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర కోస్తా ప్రాంతంలో చేరేస‌రికి వ‌రుస పెట్టి వైసీపీలోకి వ‌ల‌స‌లు స్టార్ట్ అయ్యాయి అనే చెప్పాలి. ముమ్మిడివ‌రం నుంచి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ వైసీపీలో చేర‌గా, ఇక కృష్ణాలో య‌ల‌మంచిలి ర‌వి కూడా వైసీపీలో చేరారు. ఇక రాయ‌ల‌సీమ నుంచి కాట‌సాని ఇటు వసంత‌ కృష్ణ , గుంటూరు నుంచి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీలో ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఇప్ప‌టికే ముహూర్తం ఫిక్స్  చేసుకున్నారు.
 
అయితే ఇటు ఉత్త‌రాంధ్రా నుంచి కూడా వైసీపీలో కి వ‌ల‌స‌లు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి.... విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేత వైసీపీలో చేరనున్నారు...టీడీపీ నేత‌ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తెలుగు దేశానికి గుడ్‌బై చెప్పి ఫ్యాన్ గూటికి చేరనున్నారు...  ఇక మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు కన్నబాబు వెల్లడించారు. 
 
ఇక 2014 ఎన్నిక‌ల్లో జిల్లాలో య‌ల‌మంచిలిలో  తెలుగుదేశం విజ‌యం చెంద‌డానికి ఇక్క‌డ ఎంతో కృషిచేశాను అని ఆయ‌న అన్నారు.. చంద్ర‌బాబు త‌న‌ను న‌మ్మించి మోసం చేశారు అని ఆయన వెల్ల‌డించారు.. ఇక పార్టీ త‌ర‌పున ఇక్క‌డ త‌న‌కు విలువ లేకుండా పోయిందని త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు...అలాగే నారా లోకేశ్ కూడా హామీ ఇచ్చి దగా చేశారన్నారు. అందుకోసమే వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇక భగవంతుడు చెప్పినా విననని తెగేసి చెప్పారు. య‌లమంచిలి, పాయకరావుపేటలో వైసీపీ గెలుపే లక్ష్యంగా తాను పని చేస్తానని కన్నబాబు వెల్లడించారు.
 
ఇక్క‌డ క‌న్న‌బాబుకు మంచి కేడ‌ర్ ఉంది కాంగ్రెస్ హాయాంలో క‌న్న‌బాబు ఎమ్మెల్యే అయ్యారు.. మంత్రి కొణతాల హయాంలో చక్రం తిప్పారు జిల్లా రాజ‌కీయాల్లో. కొణతాల అనుచ‌రుడిగా ఆయ‌న‌కు ఇక్క‌డ పేరు ఉంది.. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలుగుదేశంలోచేరారు క‌న్న‌బాబు.....
 
అయితే ఆయన‌కు సీటు ఇవ్వ‌క‌పోయినా ఎమ్మెల్సీ ఇస్తాను అని హామీ ఇచ్చారు గ‌తంలో చంద్ర‌బాబు.. కాని ఆ హామీ నెర‌వేర్చ‌లేదు ఇప్ప‌టికీ నాలుగేళ్లు అయినా.... ఇక య‌ల‌మంచిలి నుంచి తెలుగుదేశం త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కోసం క్యూ భారీగా ఉంది.....  ఇప్పుడే సీటు ఇవ్వ‌డం లేదు ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు సీటు ఇస్తారు అని ఆశ‌లేదు అని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు.... అందుకే  వైసీపీలోకి చేరాలి అని ఆయ‌న భావించార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.