వైసీపీలో చేరిన యలమంచిలి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 15:11:52

వైసీపీలో చేరిన యలమంచిలి

తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి చెప్పిన విధంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కృష్ణాలో ప్ర‌వేశించిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకున్నారు జ‌గ‌న్ స‌మ‌క్షంలో. కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు... టీడీపీలో త‌న‌కు స‌రైన గౌర‌వం ద‌క్క‌లేదు అని తెలియ‌చేశారు.
 
2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఆ తర్వాత టీడీపీలో చేరాను. ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్తున్నాను. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనడంతో యువత నిరుత్సాహపడ్డారు. తెలుగుదేశం ప్ర‌త్యేక హూదా పై  తీసుకున్న యూట‌ర్న్  నిర్ణ‌యం ఏ మాత్రం న‌చ్చ‌లేదు  అని అన్నారు.
 
2004, 2014లో నన్ను పార్టీలో  భంగపడేలా చేశారు. 2014 నుంచి అవకాశం రాకపోయినా పార్టీలో ఉన్నాను పార్టీలో అంద‌రి కోసం శ్ర‌మించారు పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను అయినా త‌న‌కు స‌ముచిత గౌర‌వం ఇవ్వ‌లేదు అని అన్నారు.. కొందరి చర్యల కారణంగా నేను పార్టీలో ఉన్నానో లేదో నాకే అర్థం కాలేదు. దీంతో బాధపడ్డాను అని  తెలియ‌చేశారు ర‌వి.
 
టీడీపీలో ఉన్న మంత్రులు నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధకు గురిచేశాయి. అవే నేను పార్టీ మారడానికి దోహదపడ్డాయి అని తెలిపారు ర‌వి.... రైతు గర్జన సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకుని మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారు ఇలా ఎంత కాలం మోసపోతాం అని అన్నారు. టీడీపీలో నాకు గౌరవం ఇవ్వలేదు. మనస్తాపం చెందాను. నా తండ్రి లాగానే వివాదాలు లేకుండానే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాను.
 
మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాం. వైఎస్‌ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’  అని యలమంచిలి రవి పేర్కొన్నారు... య‌ల‌మంచిలి ర‌వి పార్టీ మారి వైసీపీలో చేర‌డంతో, విజ‌య‌వాడ సెగ్మెంట్లో వైసీపీకి తిరుగులేదు అంటున్నారు అక్క‌డ వైసీపీ కేడ‌ర్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.