రేపు వైసీపీలో చేరుతా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-13 17:01:54

రేపు వైసీపీలో చేరుతా....

టీడీపీ ఎన్నిబ్రేకులు వెయ్యాలి అని చూసినా అవ‌న్ని ప‌టాపంచ‌లు అయ్యాయి.. య‌ల‌మంచిలి ర‌విని తెలుగుదేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా నిలువ‌రించాలి అనుకున్న టీడీపీకి ఎదురుదెబ్బే త‌గిలింది... గ‌తంలోనే మోస‌పోయా ఇప్పుడు మ‌ళ్లీ మోస‌పోలేను అని ర‌వి ఆలోచించారు... సీటు ఇవ్వ‌డం కాదు క‌దా అస‌లు స‌ముచిత‌స్దానం ఇవ్వ‌ని చోట ఎందుకు అని ఆయ‌న పార్టీ మారాలి అని నిర్ణ‌యం తీసుకున్నారు..
 
ర‌వి త‌న ఆత్మీయుల‌తో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ...నేటితో తెలుగుదేశానికి నాకు చెల్లు అని, రేపు వైసీపీలో చేర‌బోతున్నాను అని ఆయ‌న తెలియ‌చేశారు.టీడీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సివచ్చిందో, అన్ని సంగతులూ రేపు తెలియ‌చేస్తా అన్నారు ర‌వి.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడు యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు..ఈ కార్య‌క్ర‌మానికి  పెద్ద ఎత్తున ర‌వి అభిమానులు కార్య‌క‌ర్త‌లు ఆయ‌న కేడ‌ర్ పాల్గొన్నారు.
 
నా కార్య‌క‌ర్త‌లు కేడ‌ర్ నా వెన్నంటి ఉన్న‌వారు అంద‌రితో చర్చించాను అని... అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాను అని తెలియ‌చేశారు ఆయ‌న‌. కనకదుర్గమ్మ వారధి దగ్గర్లోని సాయిబాబా గుడి వద్ద జగన్‌ సమక్షంలో రేపు  అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని తెలిపారు. ఇక ర‌విలాంటి మంచి నాయ‌కుడు వైసీపీలోకి రావ‌డం చాలా ఆనంద‌క‌ర‌మైన విష‌యం అని అన్నారు. ఇక బీజేపీ నుంచి వైసీపీలోకి వలసలు ప్రారంభం అయ్యాయి అని తెలుస్తోంది.ఇటు బీజేపీ యువ‌నాయ‌కుడు సాయి ప్రసాద్ కూడా రేపు జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతున్న‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.