యనమల చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

yanamala speech about no confidence motion
Updated:  2018-03-20 11:39:45

యనమల చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

బీజేపీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా సభావిశ్వాసాన్ని కోల్పోయిందని పార్లమెంట్ లో వైసీపీ, టీడీపీలు వేర్వేరుగా నోటీసులు ఇచ్చాయి. కేంద్రం ఉద్దేశపూర్వకంగా సాంకేతిక కారణాలను చూపుతూ అవిశ్వాస తీర్మానం చర్చకు రానీయకున్నారు. ఈ విషయంలో కచ్చితంగా కేంద్రం పార్లమెంటరీ సాంప్రదాయాలను ఉల్లగిస్తోంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
 
ఈ నేప‌థ్యంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ రాష్ట్ర శాశనసభ వ్యవహరాల మంత్రి యనమల కీలక వ్యాఖ్యలు చేసారు... అసలు యనమల సాంప్రదాలను గురించి మాట్లాడే ముందు తాను అసంబ్లీలో వ్యవహరిస్తున్న తీరుకు సమాదానం చెప్పాలి.
 
కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక పద్దతిని ప్రస్తుతం ఏపీ ఆర్థిక‌ మరియు శాశనసభ వ్యవహరాల మంత్రి యనమల ప్రశ్నిస్తున్నారు... నిజమే ఆయ‌న‌ చెపుతున్న విలువలు కచ్చితంగా పాటించాలి... కాకపోతే తన ప్రభుత్వం అసెంబ్లీ విలువలను కాపాడటంలో అనుసరిస్తున్న పద్దతికి కూడా వారు సమాదానం చెప్పాలి....  ప్రతిపక్ష  వైసీపీకి చెందిన సభ్యులను ఫీరాయింపు చట్టానికి వ్యతిరేకంగా తమ పార్టీలో చేర్చుకుని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు.... ప్రతిపక్షం ఇచ్చిన అనర్హత పిర్యాధును నెలలు గడుస్తున్నా పరిష్కరించకపోవడం ఏ పార్లమెంటరీ సాంప్రదాయమో యనమల చెప్పాలి... 
 
అయితే ఆదే విషయంపై ఏకంగా వైసీపీ శాశనసభ సమావేశాలను బహిష్కరించింది... పార్లమెంట్ లో సాంప్రదాయాలను గురించి మాట్లాడే యనమల వారికి తమ ప్రభుత్వం మాత్రం అందుకు బిన్నంగా నడుచుకోవడం మంచి సాంప్రదాయం కాదు అన్న విషయం తెలియదా?  లేదా టీడీపీ ప్రభుత్వం అందుకు అతీతమైందా?.
 
అంతే కాదు గతంలో ఏపీ అసెంబ్లీలో వైసీపీ స్పీకర్ వైఖ‌రికి నిరసనగా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టింది... మరో సందర్భంలో ఆర్దిక పద్దుకు సంబంధించిన విషయంపై కూడా ఓటింగ్ తో కూడిన చర్చకు వైసీపీ డిమాండ్ చేసింది... వైసీపీ తీర్మాణంలో ప్రధాన ఉద్దేశ్యం తమ నుంచి ఫిరాయించిన సభ్యులకు విప్ జారీ చేయడం కూడా ఒకటి...అది వారికి చట్టప్రకారం లంభించిన హక్కు కూడా... కానీ ఆ హక్కును నిరాకరిస్తూ సభలోనే అధికార పార్టీ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా నోటీసులు ఇచ్చిన రోజే సభలో తీర్మాణంపై చర్చకు అంగీకరించింది. 
 
తమ సభ్యులకు విప్ జారీ చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీ సమయం కోరుతూ అందుకు సభ సాంప్రదాయాలను సభాపతి దృష్టికి తెచ్చారు... వారి హక్కును ఉల్లంగించడమే కాకుండా సంప్రదాయాలను సస్పెండ్ చేస్తూ సభలో తీర్మాణాన్ని యనమల ప్రవేశపెట్టారు.... అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలంటే కచ్చితంగా సభలో సభ్యుడు అయిఉండాలి...అందుకు భిన్నంగా మండలి సభ్యుడైన యనమల సంప్రదాయాలను ఉల్లంగించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు... అలా సంప్రదాయాలను యదేచ్చిగా ఉల్లంగిస్తూ, ఆ ఉల్లంగన ఘనకార్యానికి కేంద్రబిందువైన యనమల నేడు అలాంటివే అటు, ఇటుగా అమలు చేస్తున్న కేంద్రానికి నీతులు చెప్పడం మాత్రం విచిత్రమే.

షేర్ :

Comments

1 Comment

  1. MANA GUDDA KINDA NALUPU MANA KI KANAPADADU. OKA VELA KANAPADINA TOOCH..... ADI NALUPU KAADU TELUPU ANI BUKAYISTARU. ENDUKU ANTE AP PRAJALU VAALLA DRUSHTI LO V.P.LU.

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.