కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌లేము య‌న‌మ‌ల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-31 18:32:45

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌లేము య‌న‌మ‌ల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, రిజ‌ర్వేష‌న్ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సింది కేంద్రం మాత్ర‌మే అని ఆయ‌న ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజ‌ర్వేష్ల‌ను ఇవ్వ‌రాద‌ని... సుప్రీం కోర్టు చెప్పిన మాట నిజ‌మేన‌ని య‌న‌మ‌ల స్ప‌ష్టం చేశారు.
 
అయితే 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు ఇస్తే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సిందేన‌ని మంత్రి య‌న‌మ‌ల పేర్కొన్నారు. వాస్త‌వానికి రిజ‌ర్వేష‌న్ల అంశం రాష్ట్ర ప‌రిధిలోకి రాద‌ని, అది కేవ‌లం కేంద్రం మాత్ర‌మే రాజ్యాంగా స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. 
 
కాగా ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్ష‌నేత  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెబితే టీడీపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో స‌హా టీడీపీ నాయ‌కులు ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు చేశారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు తీసుకువ‌చ్చేది టీడీపీనే అని చెప్పి ఇప్పుడు మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకుని జ‌గ‌న్ చెప్పిన మాట‌ల‌నే మ‌ళ్లీ రిపీట్ చేస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.