య‌న‌మ‌ల రూటే వేరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

yanamala
Updated:  2018-08-24 03:33:39

య‌న‌మ‌ల రూటే వేరు

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులంద‌రు ఒక వైపు అయితే ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాత్రం ఒక వైపు. స‌మ‌యం సంద‌ర్భంలాంటివి ప‌ట్టించుకోకుండా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అయితే బ‌హుశా అలా తిట్టడ‌మో ఏమో కావ‌చ్చు ప్ర‌స్తుతం ఆయ‌న ప‌ళ్ల‌కు కాస్త తేడా వ‌చ్చి రూట్ కెనాల్ చికిత్స చేయించుకోవాల్సి వ‌చ్చింది. ఈ రూట్ కెనాల్ చికిత్స‌ చేయంచుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌తీ అడుగుకు ఒక సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులు ఉన్నాయి. 
 
కానీ మంత్రి య‌న‌మ‌ల‌కు అవేమి న‌చ్చ‌నట్లు లేవు. సింగ‌పూర్ త‌ర‌హా రాజ‌ధానిని క‌ట్టుకుంటున్నాము కాబ‌ట్టి చికిత్స కూడా అదే త‌ర‌హాలో ఉండాల‌ని అనుకున్నారో ఏమో  కానీ సింగ‌పూర్ లో రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. మామూలు పేషెంట్ ను చూస్తేనే ప‌ళ్లు రాలేలా సింగ‌పూర్ ఆసుపత్రికి త‌గిన‌ట్లు బిల్లు వేశారు. అయితే మంత్రి చికిత్స‌కు సుమారు 2 ల‌క్ష‌ల 80 వేల బిల్లును వేశారు. 
 
చికిత్స‌కు చేసిన ఖ‌ర్చు మోత్తాన్ని య‌న‌మ‌ల రియంబ‌ర్స్ మెంట్ ధ‌ర‌ఖాస్తు చేసుకున్నారు. క్యాబినెట్లో సీనియ‌ర్ నేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు న‌మ్మ‌క‌స్తుడు కాబ‌ట్టి ఎలాంటి చ‌ర్చ‌లు లేకుండానే దాదాపు మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు మొత్తం రియంబ‌ర్స్ అయిపోయింది. దీంతో య‌న‌మ‌ల దుబారాపై విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. నిరుపేద‌ల‌కు చెల్లించాల్సిన విష‌యంలో పొదుమంత్రాలు జ‌రిపించే ప్ర‌భుత్వం మంత్రులు విష‌యంలో ఉదారంగా ఖ‌ర్చుల‌కు తావిస్తోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.