వైఎస్ అభిమానుల‌కు శుభ‌వార్త‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 16:05:25

వైఎస్ అభిమానుల‌కు శుభ‌వార్త‌

తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో బయోపిక్ ల హవా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు క్రిష్ ఒక సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.
 
ఈ చిత్రంలో హీరో బాలకృష్ణ త‌న తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇదే క్ర‌మంలో మాజీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి దివంగ‌త‌నేత డా. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని యాత్ర అనే టైటిల్ తో ద‌ర్శ‌కుడు వి.రాఘ‌వ్ తెర‌పైకి తీసువ‌స్తున్నారు. 
 
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లలోపు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నే సంక‌ల్పంతో చిత్ర యూనిట్ అన్ని పాత్ర‌ల‌కు సంబంధించిన న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకుని హైద‌రాబాద్ పరిస‌ర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుతున్నారు. ఈ షూటింగ్ లో కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్ర‌యూనిట్ చిత్రీక‌రిస్తోంది. వైఎస్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ళ‌యాల న‌టుడు ముమ్మ‌ట్టి పోషిస్తున్నారు. 
 
అయితే ఇప్ప‌టికే ఈ చిత్రాకి సంబందిచిన ఒక పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ఈ నేప‌థ్యంలో ఈనెల 8వ తేదిన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి  చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంద‌ట. ఇక ట్రైలర్ ను చూసేందుకు వైఎస్ అభిమానులు కార్య‌క‌ర్త‌లు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.