యాత్ర సెకెండ్ లుక్ అదిరింది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

yatra
Updated:  2018-09-07 03:11:32

యాత్ర సెకెండ్ లుక్ అదిరింది

మ‌ళ‌యాల స్టార్ హీరో మమ్ముటి... ఈయ‌న ప్ర‌స్తుతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ లో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. మమ్ముట్టి గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క‌థ న‌చ్చితే చాలు భాష ఏదైనా స‌రే ఆ క‌థ‌లో జీవిస్తారు. ఇలా ఆయ‌న‌కు న‌చ్చిన క‌థల‌ సినిమాలు చెప్పుకోద‌గిన సినిమాలు చాలానే ఉన్నాయి. 
 
తాజాగా వైఎస్ బ‌యోపిక్ లో న‌టిస్తుండ‌టంతో మమ్ముట్టి క్రేజ్ మ‌రింత పెరిగింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 2019 ఎన్నిక‌లు మొద‌ల‌య్యే నాటికి ఈ సినిమా విడుద‌ల చెయ్యాల‌నే ఉద్దేశంతో చిత్ర యూనింట్ ముమ్మ‌రంగా షూటింగ్ నిర్వ‌హిస్తుంది. అయితే ఇప్ప‌టికే ప్ర‌ధాన పాత్ర‌ల‌కు సంబంధించిన వాట‌న్నిటిని షూట్ చేసుకుంది చిత్ర బృందం.
 
ఇక ఈ రోజు మమ్ముట్టి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఒక పోస్ట్ ను విడుద‌ల చేసింది. ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల్లో పాద‌యాత్ర చేసుకుంటూ జ‌నం మ‌ధ్య‌లో ఉండి మీ అంద‌రికి నేనున్నాను భ‌య‌ప‌డ‌కండి అంటూ భ‌రోసా ఇస్తున్న ఫోటోను రిలీజ్ చేసింది. అయితే ఇప్ప‌టికే చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం వ‌దిలిన ఫ‌స్ట్ లుక్ కు ప్ర‌జ‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు వ‌దిలిన సెకండ్ లుక్ కు మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.