జ‌గ‌న్ పంపిన రాయ‌బారం సక్సెస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-18 13:52:09

జ‌గ‌న్ పంపిన రాయ‌బారం సక్సెస్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తూనే మ‌రో వైపు పార్టీలోనే ఉన్నా రాజకీయాల‌కు దూరంగా ఉంటున్న నాయ‌కులను దృష్టిలో ఉంచుకుని వారి ద‌గ్గ‌ర‌కు రాయబారం పంపిస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన కీల‌క‌నేత మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి చాలా కాలంగా పార్టీ పై అసంతృప్తితో ఉన్నారు.  
 
2014 ముక్కోన‌పు సిరిస్ అయిన‌టు వంటి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషంలో జ‌గ‌న్, కాశిరెడ్డికి సీటు కేటాయించకుండా మ‌ధుసుధ‌న్ యాద‌వ్ కు కేటాయించారు. దీంతో ఆయ‌న అల‌క చెంది చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇక‌ అదే స‌మ‌యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నత‌న వ్యాపారం పై దృష్టి సాదించి మంచి వ్యాపార‌స్తుడుగా  గుర్తింపు తెచ్చుకున్నారు కాశిరెడ్డి. 
 
అంతేకాదు ఆయ‌న బాబా భ‌క్తుడు కూడా, కుటుంబంలో బాబా పూజ‌లు చేస్తున్నారంటే ఇటు రాజ‌కీయాన్ని కానీ అటు వ్యాపారాన్ని కానీ పూర్తిగా వ‌దిలేసి పూజ‌లో పాల్గొనే వ్య‌క్తి ఆయ‌న. బాబాకు ఇంత‌క‌న్నా బ‌ల‌మైన భ‌క్తుడు లేరంటే న‌మ్మ‌డంలో  ఏ మాత్రం అతిశ‌యోక్తి  లేదు. కాశిరెడ్డి భ‌క్తితో పాటు ప్ర‌జా బ‌లం కూడా ఎక్కువ‌గా ఉంది. ఇక ఆయ‌న‌ను ఎలాగైనా తిరిగి వైసీపీలో యాక్టీవ్ చేయాల‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా క‌నిగి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ జెండా ఎగ‌ర వేయాల‌నే ఉద్దేశ్యంతో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేకహోదా కోసం రాజీనామా చేసిన మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని, రాయ‌బారానికి పంపించారు. ఇక ఆయ‌న త‌న వెంట క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌ యాదవ్ ను  తీసుకుని కాశిరెడ్డి నివాసానికి చేరుకుని కాశిరెడ్డితో భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. 
 
ఈ భేటీ సుమారు 35 నిమిషాల‌పాటు వైవీ, కాశిరెడ్డితో చ‌ర్చించి ఇక్క‌డున్న‌టు వంటి పార్టీ ప‌రిస్థితి గురించి వివ‌రించారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఖ‌చ్చితంగా వైసీపీకి స‌పోర్ట్ చెయ్యాల‌ని వైసీపీ అధికారంలోకి వ‌స్తే త‌న‌దైన గౌర‌వం ఇస్తుంద‌ని వైవీ స్ప‌ష్టం చేశారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చెయ్యాల‌ని ఉద్దేశ్యం ఉంటే పార్టీ అధినేత పోటీ చేయించేందుకు సిద్దంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. అయితే కాశిరెడ్డి తాను పోటీ చెయ్య‌న‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ కి స‌పోర్ట్ చేస్తాన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి జ‌గ‌న్ పంపిన రాయ‌బారం వైవీ సుబ్బారెడ్డి విజ‌య‌వంతం చేశార‌నే చెప్పాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.