వైసీపీకి అడ్డాగా మారిన ఆ నియోజ‌క‌వ‌ర్గం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-22 11:11:45

వైసీపీకి అడ్డాగా మారిన ఆ నియోజ‌క‌వ‌ర్గం

జిల్లా కేంద్రం అయిన క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లింల ప్ర‌భావం ఎక్కువ. పూర్తిగా క‌డ‌ప ప‌ట్ట‌ణ‌న‌మైన ప్రాంతంలో మిగిలిన సామాజిక వ‌ర్గాల కంటే మైనార్టీ ఓట‌ర్ల‌ తీర్పే కీల‌కం. అందుకే ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ త‌ర్వాత క‌డ‌ప జిల్లాను మినీ రాజ‌ధానిగా పిలుస్తుంటారు. 1994 నుంచి పార్టీ ఏదైనా మైనార్టీ అభ్య‌ర్థులే క‌డ‌ప నుంచి గెలుస్తూ వ‌స్తున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి అంజాద్ బాష గెలిచారు గ‌త ఎన్నిక‌ల్లో. మైనార్టీ ఓట‌ర్ల‌తో పెద్ద‌ ఫాలోయింగ్ ఫేమ్ తో ప‌నిలేకుండా పార్టీ టికెట్ ఇస్తే చాలు గెలిచేస్తారు రాజ‌కీయ నాయ‌కులు. ఇక ఈ కొవ‌లోనే మున్సిప‌ల్ చైర్మ‌న్ గా ఉన్న అహ్మ‌దుల్లాకు టికెట్ ఇచ్చి గ‌తంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంది కాంగ్రెస్ పార్టీ. 
 
కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారంలోకి రావ‌డంతో వైఎస్, కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాల్లో ఆయ‌న మైనార్టీ శాఖ‌ మంత్రిగా ప‌ని చేశారు. అయితే అంత‌కుముందు ప్ర‌ముఖ వైద్యుడు క‌లీల్ బాష‌ను క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు రెండుసార్లు అసెంబ్లీకి పంపారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ బాషకు రాజ‌కీయ నేప‌థ్యంలో పెద్ద‌గా ప‌ట్టులేదు. వైఎస్ కుటంబం అభిమానంతో ఆయ‌న వైసీపీలో చేరారు. దీంతో అంజాద్ బాష గ‌త ఎన్నికల్లో పార్టీ త‌ర‌పున టికెట్ ద‌క్కించుకున్నారు. ఇక ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో క‌ప‌డ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా మైనార్టీల‌కు కంచుకోట‌గా మారింది. 
 
అయితే ఇదే క్ర‌మంలో సార్వ‌త్రి