సంచ‌ల‌నం అక్టోబ‌ర్ 2న వైసీపీ మ‌రోసారి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-19 02:39:06

సంచ‌ల‌నం అక్టోబ‌ర్ 2న వైసీపీ మ‌రోసారి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష

ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం తాము ఎంత‌వ‌ర‌కైనా పోరాటం చేస్తామ‌ని మ‌రోసారి నిరూపించుకుంది ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ స్థాపించినప్ప‌టినుంచి అధినేత జ‌గన్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కోసం అనేక పోరాటాల‌ను చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను అక్ర‌మ అరెస్ట్ లు చేయించినా కూడా వాటికి భ‌య‌ప‌డ‌కుండా ప్ర‌జా ప‌క్షాన నిలిచారు. 
 
అంతేకాదు ప్ర‌త్యేక హోదా రాష్ట్రానికి ఎంత అవ‌స‌ర‌మో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వివ‌రించి వారికి అవ‌గాహ‌న క‌ల్పించిన వ్య‌క్తి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌త్యేక హోదా సెగ‌లను కేంద్రానికి తాకేలా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో వైసీపీ ఎంపీల‌తో సుమారు ప‌ద‌మూడుసార్లు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మ‌నం పెట్టి వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత డిల్లీలోని ఏపీ భ‌వ‌న్ నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్ష‌తో దేశ‌వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ నాయ‌కులను ఆలోచింపజేసేలా చేశారు జ‌గ‌న్. 
 
అయితే ఇదే క్ర‌మంలో మ‌రో ఉద్య‌మానికి తెర‌లేపుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కోసం భూ సేక‌రణ జ‌రిపి సుమారు రెండుసంవ‌త్స‌రాలు కావొస్తున్నా ఇంత‌వ‌ర‌కూ రైత‌లుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు న‌ష్ట‌ప‌రిహాం చెల్లించ‌క‌పోవ‌డం దారుణం అని వైసీపీ నాయ‌కులు జ‌క్కంపూడిరాజా మండిప‌డుతున్నారు. త‌క్ష‌ణ‌మే రైతుల‌పై స్పందించి వారికి కేటాయించ‌వ‌ల్సిన ప‌రిహారాన్ని వెంట‌నే కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. లేకపోతే తాము వైసీపీ త‌ర‌పున గాంధీ జ‌యంతి రోజునాడు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తామ‌ని రాజా హెచ్చ‌రించారు. 
 
రావాలి జ‌గ‌న్ కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం రైతుల‌కు ఇవ్వ‌ల‌సిని న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌భుత్వం ఇవ్వ‌కుండా ఇష్టానుసారంగా పంపిణి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే టీడీపీ నాయ‌కులు ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తిస్తే తాము స‌హించేదిలేద‌ని రైతుల‌ప‌క్షాన నిలిచి ఎంత‌వ‌ర‌కైనా పోరాడుతామ‌ని రాజా స్ప‌ష్టం చేశారు. పరిహారం విష‌యంలో అర్ అండ్ అర్ ప్యాకేజీ వ‌ర్తించే రైతుల‌కు రైతుల కూలీల‌కు ఈ రోజుకు కూడా న్యాయం చేయ‌క‌పోవ‌డం బాధాక‌రం అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.