వైసీపీ ఆఫ‌ర్ కాంగ్రెస్ ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 16:21:46

వైసీపీ ఆఫ‌ర్ కాంగ్రెస్ ఆఫ‌ర్

కొణ‌తాల రామ‌కృష్ణ వైసీపీలో కి ఎంట్రీ ఇస్తారు అని గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.. ముఖ్యంగా కొణ‌తాల రామ‌కృష్ణ‌కు వైయ‌స్ విజ‌య‌మ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడారు అని ఇటు వైసీపీ నాయ‌కులు కూడా ఆయ‌న‌తో టచ్ లో ఉన్నారు అని వార్త‌లు వినిపించాయి.. మ‌రీ ముఖ్యంగా కొణ‌తాల వైసీపీలోకి వ‌స్తే ఇటు వైసీపీకి ఉత్త‌రాంధ్రాలో మ‌రింత ప్ల‌స్ అవుతుంది అని వైసీపీ ఆలోచిస్తోంది.. అందులో భాగంగా వైసీపీ త‌న ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం దాల్చుతోంది.
 
ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఆయ‌న‌కు సీటు ఆఫ‌ర్ చేస్తోంది.. మ‌రో వైపు ఆయ‌న తెలుగుదేశంలోకి రాక‌పోతే ఆయ‌న‌కు అన‌కాప‌ల్లి ఎంపీ సీటు ఇచ్చే విష‌యంలో స‌బ్బం హ‌రి పార్టీలోకి వ‌స్తే ఆయ‌న‌కు సీటు ఇచ్చే ఆలోచ‌న తెలుగుదేశం చేస్తోంది. ఇటు అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఇప్పుడు త‌న రూటు మార్చుకున్నారు అనేది తెలిసిందే .. ఆయ‌న భీమిలి ఎమ్మెల్యే స్దానానికి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.
 
అందుకే ఇటు టీడీపీ స‌బ్బంహ‌రికి ఇక్క‌డ టికెట్ ఇస్తాను అంటే ఇటు వైసీపీ కొణ‌తాల‌కు టికెట్ ఇస్తాను అంటోంది..మొత్తానికి వీరి ఇద్ద‌రి సీటు పై ఇప్పుడు వార్త‌లు వ‌స్తుంటే ఆయ‌నకు కాంగ్రెస్ నుంచి పిలుపు వ‌చ్చింది అంటున్నారు. ముఖ్యంగా పీసీసీ ప‌గ్గాలు ఆయ‌న‌కు ఇచ్చేందుకు ఏపీలో కాంగ్రెస్ బాధ్య‌త‌లు ఆయ‌న‌కు అప్ప‌గించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దం అయింది అని తెలుస్తోంది..ఇప్ప‌టికే ఆయ‌న‌కు ఈవిష‌యం పై తెలియ‌చేశారు అని వార్తలు వ‌స్తున్నాయి.మ‌రి ఈయ‌న ఎటువైపు రూటు చూసుకుంటారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.