టీడీపీ, వైసీపీ రేసు గుర్రాలు వీళ్లే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 18:47:52

టీడీపీ, వైసీపీ రేసు గుర్రాలు వీళ్లే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండ‌టంతో  నియోజ‌కవ‌ర్గాల వారిగా త‌మ ఆదిప‌త్యాన్ని తెలుసుకునేందుకు ఇటు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అటు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు సెగ్మంట్ ల వారిగి త‌మ స‌త్తా ఏంటో తెలుసుకునేందుకు రెడి అవుతున్నారు. ఒక వైపు 2019లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి చ‌రిత్ర‌ను సృష్టించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. 
 
ఇక మ‌రోవైపు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోతే పార్టీ మ‌నుగ‌డ దెబ్బ‌తింటుంద‌ని భావించి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చూస్తున్నారు. ఇక ఇరు పార్టీ నాయ‌కుల‌ పోరులో కార్య‌క‌ర్త‌లు పండ‌గ చేసుకుంటారు. ప్ర‌తీ గ్రామానికి వెళ్లి త‌మ‌నాయ‌కుడి ఖ‌చ్చితంగా ఓటు వేయ్యాల‌ని ప్ర‌చారం చేసుకుంటూ ఊరు వాడ హంగామా చేస్తారు. 
 
ఇక ఈ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ప‌ట్టు ఎలా ఉందో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి స‌ర్వే నిర్వ‌హించిన త‌ర్వాత వ‌చ్చె ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో అభ్య‌ర్థుల‌ను నియ‌మించ‌డంలో చంద్ర‌బాబే స్వ‌యంగా బాధ్య‌త‌లు తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఎందుకంటే ఎన్న‌డు చూడ‌ని విధంగా 2019 సార్వ‌త్రిక ఎన్నికల‌కు వార‌స‌త్వ రాజ‌కీయాలు ఎక్కువ అవుతున్నాయి. ఒక‌రేమో త‌మ కుంటుంబానిక రెండు టికెట్లు కావాలంటూ చంద్ర‌బాబు అపాయింట్ మెంట్ కోసం కాళ్లు అరిగేలా అమ‌రావ‌తి చుట్లు తిరుగుతున్నారు. ఇక మ‌రికొంద‌రేమో తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేయ్య‌ను కాబ‌ట్టి త‌న టికెట్ త‌న కుమారుడికి పార్టీ త‌ర‌పున టికెట్ కేటాయించాల‌ని చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.  
 
ఇక ఫైన‌ల్ గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టీడీపీ త‌ర‌పున పోటీ చేయించే కొన్నిపేర్ల‌ను బ‌యట పెట్టిన‌ట్లు తెలుస్తోంది. క‌ర్నూల్ జిల్లాలో యువ ఎమ్మెల్యేలు భూమా కుటుంబం నుంచి అభిల‌ప్రియ‌, బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి, ప‌త్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, ఎమ్మిగ‌నూరులో జ‌య‌నాగేశ్వ‌ర‌రెడ్డిని, బ‌న‌గాన‌ప‌ల్లిలో బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి నియ‌మించ‌నున్నార‌ని తెలుస్తోంది, అలాగే నందికొట్కురు నుంచి బైరెడ్డి ఫ్యామిలీలో ఒక‌రు రంగంలో దిగ‌నున్న‌ర‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
దీంతోపాటు అనంత‌పురం జిల్లాలో కూడా చంద్ర‌బాబు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 స్థానాల్లో 13మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక‌రు ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరంద‌రిని చంద్ర‌బాబు పోటీ చేయించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
మ‌రోవైపు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా రాయ‌ల‌సీమ‌లో వైసీపీ త‌ర‌పున పోటీ చేయించేందుకు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లాలో ప‌త్తికొండ నుంచి చెరుకుల‌పాడు శ్రీదేవిని, అలాగే ఎమ్మిగ‌నూరు నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, బ‌న‌గాన ప‌ల్లె నుంచి కాట‌సాని రామిరెడ్డిని పోటీ చేయించాల‌ని చుస్తున్నార‌ట‌.
 
అలాగే అనంత‌పురం జిల్లాలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, పెద్ది రెడ్డి, అలాగే క‌డ‌ప జిల్లా నుంచి ప‌లు పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో నుంచి శ్రీకాంత్ రెడ్డి, అమ‌ర్ నాథ్ రెడ్డి, అంజ‌ద్ భాషా, పులివెందుల నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, క‌ల‌మ‌లాపురం ర‌వింద్ర‌నాథ్ రెడ్డిల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన సీట్ల‌ అభ్య‌ర్థుల‌ను త్వ‌ర‌లో లిస్ట్ త‌యారు చేసే ఆస్కారం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.