వైసీపీలో ప‌ద‌వుల నియామకం...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-02 01:48:04

వైసీపీలో ప‌ద‌వుల నియామకం...

2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తూనే మ‌రో వైపు పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు... ఈ మేరకు రాష్ట్ర కార్య‌ద‌ర్శులును నియ‌మిస్తున్న‌న్న‌ట్లు పార్టీ కార్యాలాయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ఇప్ప‌టికే వైసీపీ క‌మిటీ మెంబ‌ర్లను అలాగే  పార్ల‌మెంట్ వైసీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్ ల‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే
 
ఇక తాజాగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంవీ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి, అలాగే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన చెలిక‌లి రాజ‌మోహ‌న్ రావుల‌ను రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ త‌మ‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ద‌వులును కేటాయించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని 2019లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిని చేసేందుకు త‌మ వంతు కృషిచేస్తామ‌ని హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి, రాజ‌మోహ‌న్ రావు స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.