వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా చ‌ల్లా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 11:55:10

వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా చ‌ల్లా

2019లో అదికారమే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తూనే మ‌రో వైపు పార్టీని ప్ర‌జల్లోకి తీసుకువెళ్తేందుకు స‌రికొత్త ప్లాన్లు వేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ త‌ర‌పున రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా చ‌ల్లా మ‌ధుసూద‌న్ రెడ్డినిఎంపీక చేశారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్ల‌మెంట్ పరిధిలో ఉన్న సోష‌ల్ మీడియా ఇంచార్జ్ లను నియ‌మించిన‌ సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో చ‌ల్లాను రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా జ‌గ‌న్ నియ‌మించారు. అంతేకాదు పార్టీ కార్యాలాయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత చల్లా మాట్ల‌డుతూ, జ‌గ‌న్ త‌న‌ను పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు.