వైసీపీ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:20:26

వైసీపీ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌తిప‌క్షనేత‌ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం నిత్యం పోరాడుతూనే ఉన్నారు. అయితే ఈ క్ర‌మంలో తన ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయకుండా జ‌గ‌న్ అమ‌రావ‌తిలో నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే.అలాగే పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశం రోజున‌ వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలతో రాజీనామా చేయించి ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేయించారు జ‌గ‌న్. 
 
ఆ త‌ర్వాత  కూడా వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు క‌లిసి ఏప్రిల్ 30న‌ విశాఖ‌ప‌ట్నంలో బీజేపీ, టీడీపీ చేసిన మోసాలకు వ్య‌తిరేకంగా వైసీపీ నాయ‌కులు వంచన గర్జన దీక్ష చేశారు. ఇక ఇదే స్పూర్తితో జూన్‌ 2న నెల్లూరులోని వీఆర్‌ కళాశాల మైదానంలో మ‌రోసారి వంచన గర్జన దీక్ష నిర్వహించ‌నున్నామ‌ని నెల్లూరు జిల్లా పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో పొత్తుపెట్టుకుని నాలుగు సంవ‌త్స‌రాల పాటు కాపురం చేసి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రానికి అమ్ముడు పోయార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక ఇప్ప‌డు ప్ర‌త్యేక హోదా రాష్ట్రానికి వ‌స్తే ఎంత అభివృద్ది జ‌రుగుతుందో అన్న విష‌యం ప్ర‌తీ ఒక్క‌రికి తెలుస‌ని చంద్ర‌బాబు గ్ర‌హించి బీజేపీ మిత్ర ప‌క్షానికి క‌టీఫ్ చెప్పి ప్ర‌త్యేక హోదా కావాలంటు దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. ఈ దీక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా తాము మ‌రోసారి నెల్లూరులో దీక్ష చేయ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం  చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.