ల‌గ‌డ‌పాటి క్లారిటీ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

lagadapati rajgopal
Updated:  2018-06-19 16:25:04

ల‌గ‌డ‌పాటి క్లారిటీ?

ఇప్పుడు అంతా ఏపీలో ల‌గ‌డ‌పాటి స‌ర్వే పైనే స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది... ఇటీవ‌ల చేసిన స‌ర్వేలు అన్ని వైసీపికి అనుకూలంగా ఉంటే, ఇటు ఆర్జే ఫ్లాష్ టీం స‌ర్వే మాత్రం టీడీపికి స‌పోర్ట్ గా వ‌చ్చింది.అయితే స‌ర్వే పై ఇప్ప‌టికే ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
అస‌లు ఈ స‌ర్వే నిజ‌మా కాదా దీనిపై అంద‌రూ ప్ర‌స్తుతం చ‌ర్చించుకుంటున్నారు. అయితే ల‌గ‌డ‌పాటి స‌ర్వే అంటే క‌చ్చిత‌త్వం ఉంటుంది..ఈస‌ర్వేలు  పొలిటిక‌ల్ గా మ‌రింత ప్ల‌స్ అవుతాయి పార్టీల‌కు.. అయితే అనుకూలం, ప్ర‌తికూలం ఇప్పుడు చ‌ర్చించ‌డానికి లేదు.. కేవ‌లం 10 నెల‌లు మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌టంతో నాలుగే లేదా ఐదు స‌ర్వేలు ఈ స‌మ‌యంలో వ‌స్తాయి అని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
అయితే ఇక్క‌డ స‌ర్వేలో అనేక విష‌యాలు ప‌రిశీలిస్తే జ‌గ‌న్ గ్రాఫ్ బాగా పెరిగిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది..అధికార పార్టీ గ్రాఫ్ కంటే వైసీపీ గ్రాఫ్ బాగా పెరిగింది అనేది తాజాగా తెలుస్తోంది..స‌ర్వే వివ‌రాల ప్ర‌కారం మొత్తం 175 సీట్ల‌లో 44.04 శాతం ఓట్ల‌తో టిడిపి 110 సీట్లు గెలుచుకుంటుంద‌ట‌.. అయితే 37.46 శాతం ఓట్ల‌తో ఇటు వైసీపీ 60 సీట్లు గెలుచుకుంటుంద‌ట‌.జ‌న‌సేన  8.90 శాతం ఓట్లు, కాంగ్రెస్, బీజేపీలు 1 శాతానికి కాస్త అటు ఇటుగా ఓట్లు తెచ్చుకుంటాయని చెబుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ కంటే ఇత‌రుల‌కు 5 శాతం రిపోర్టు స‌ర్వేలో తేలింది. ఇది ఇక్క‌డ విశేషం.
 
అయితే ఇక్క‌డే అధికార పార్టీపై ప్ర‌చారం మొద‌లైంది, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే కేవ‌లం 44.45 శాతం ఓట్ల‌తో  101 సీట్లు గెలుచుకుంది.,  వైసిపి 44.12 శాతం ఓట్ల‌తో 67 సీట్లు గెలుచుకుంది..అయితే ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌చ్చిన సీట్ల కంటే ఇప్పుడు వ‌చ్చే సీట్లు ఎక్కువ ఉంటాయి అని చెబుతోంది ఈ స‌ర్వే.
 
గ‌త ఎన్నిక‌ల కంటే టీడీపీకి  0.41 శాతం త‌క్కువ ఓట్లు వ‌స్తాయ‌నేది ఇక్క‌డ స‌ర్వే రిపోర్ట్‌..ఇక్క‌డ వైసీపీకి రిపోర్టులో గ్రాఫ్ త‌గ్గింది తెలుగుదేశానికి రిపోర్టులో గ్రాఫ్ త‌గ్గింది.. మ‌రి ఈ గ్రాఫ్ ఎవ‌రికి పెరిగింది అంటే స‌మాధానం లేని ప్రశ్న మ‌రి దీనిపై ల‌గ‌డ‌పాటి క్లారిటీ ఇస్తేనే, నిజాలు వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి తెలుస్తాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.