టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌కు- వైసీపీ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-22 18:37:50

టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌కు- వైసీపీ చెక్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురం పార్ల‌మెంట్ లో 2019 సార్వ‌త్రిక ఎన్నికల్లో కుటుంబ రాజ‌కీయాల‌దే హావా సాగుతోన్న‌ట్లు తెలుస్తోంది. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లే ఇక్కడ మొద‌టి నుంచి చ‌క్రం తిప్పుతున్నారు.అయితే ఈ సారి మాత్రం ఆదే వ‌ర్గంలో ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీల నుంచి భ‌రిలో దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 
 
2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున క‌నుమూరి బాపిరాజు పోటీ చెయ్య‌గా బీజేపీ నుంచి ఆయ‌న బావమ‌రిది గోక‌రాజు గంగ‌రాజు పోటీ చేసి బావ‌మ‌రిది మీద గెలిచారు. ఇక ఈ సారి జ‌రుగ‌నున్న 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం బావా బావ‌మ‌రుదుల ఇద్ద‌రి మ‌ధ్యే కాకుండా బాబాయ్ అబ్బాయ్, మామ అళ్లుల్ల మ‌ధ్య కూడా ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి ఇప్ప‌టికే క‌నుమూరి బాపి రాజు ఉండ‌గా బీజేపీ నుంచి ఆయ‌న బావ‌మ‌రిది గోక‌రాజు గంగ‌రాజు న‌ర్సాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 
 
ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజుకు న‌ర్సాపురం పార్ల‌మెంట్ టికెట్ ఖ‌రారు అయినట్లు తెలుస్తోంది. ఈయ‌న మాజీ ఎంపీ క‌నుమూరి బాపిరాజ‌కు స్వ‌యాన అన్న‌కొడుకు అలాగే ప్ర‌స్తుత బీజేపీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజుకు స్వ‌యానా మేన‌ల్లుడు. ప్ర‌ధాన పార్టీల నుంచి ఈ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి భ‌రిలో ఉండ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే కుటుంబానికి చెందిన వ్య‌క్తిని తీసుకువ‌చ్చేందుకు రంగం సిద్దం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. 
 
బీజేపీ ఎంపీ గోక‌రాజు గంగారాజు త‌న‌యుడు జీవీకే గంగ‌రాజును వైసీపీ త‌ర‌పున భ‌రిలోకి దించేందుకు వ్యూహ‌లు ర‌చిస్తున్నట్లు తెలుస్తోంది. రంగ‌రాజు క‌నుమూరి బాపిరాజుకు మేన‌ల్లుడు కాగా టీడీపీ అభ్య‌ర్థి ర‌ఘురాం కృష్ణంరాజుకు బావ‌మ‌రిది అయితే తండ్రి బీజేపీ ఎంపీగా ఉండ‌గా ఆయ‌న‌కు పోటీగా ఇప్పుడు రంగ‌రాజు పోటీ చేస్తాడనే సందేహం వ్య‌క్తం అయిన‌ప్ప‌టికి ఈ సారి మార‌నున్న రాజ‌కీయ ప‌రినామాల నేప‌థ్యంలో గంగ‌రాజు అవ‌స‌రం అయితే పోటీ నుంచి త‌ప్పుకుని కొడుకు రాజ‌కీయ జీవితానికి బ‌లం కావాల‌నుకుంటున్నార‌ని జిల్లావాసులు భావిస్తున్నారు. 
 
ఏది ఏమైన‌ప్ప‌టికి న‌ర్సాపురంలో ఒకే కుటుంబం నుంచి బావా బావ‌మ‌ర్ధులు, మామ అళ్లుల్లు, బాబాయ్ అబ్బాయ్ లు భ‌రిలోకి దిగుతున్నార‌నే వార్త‌లు న‌ర్సాపురం పార్ల‌మెంట్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను సైతం ఇటు వైపు తిప్పుకుంటున్నాయి. మ‌రి ఇంత‌టి ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయ కుంటుంబరాజ‌కీయ పోరులో ఎవ‌రు ఎవ‌రిమీద పోటీచేస్తారు... చివ‌రికి ఎవ‌రు గెలుస్తార‌నేది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారుతోంది. అయితే ఎవ‌రు గెలిచినా ఒకే కుటుంబ‌మేగా అని అంటున్నారు స్థానిక ఓట‌ర్లు. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.