వైసీపీ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 15:07:04

వైసీపీ చెక్

ఆంధ్ర‌దేశ్ కు అమ‌ర సంజీవ‌నీ అయిన ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ  ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త‌ నాలుగు సంవ‌త్స‌రాలుగా త‌న‌కున్న స్ట్రెంత్ తో నిరంత‌రం కేంద్రంపై పోరాడుతున్న‌ సంగ‌తి తెలిసిందే.ఈ క్రమంలో ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ అమ‌రావ‌తిలో నిరాహార దీక్ష చేస్తే అధికార నాయ‌కులు రాష్ట్రానికి  ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌స్తున్నార‌ని చెప్పి అధికారుల‌తో ఈ దీక్ష‌ను భ‌గ్నం చేయించారు. అయినా కూడా జ‌గ‌న్ త‌న పోరాటం ఆప‌కుండా నిరంత‌రం పోరాడుతూనే న్నారు.
 
ప్ర‌త్యేక హోదాకోసం జ‌గ‌న్ పోరాడుతున్న తీరును చూసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల‌ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాష్ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు వారి ప‌ద‌వులుకు రాజీనామా చేసి స్పీక‌ర్ ఫార్మాట్ లో సుమిత్ర మ‌హాజన్ కు స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత వారు త‌మ ప్రాణాల‌ను ఏ మాత్రం లెక్క చేయకుండా ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే గ‌తంలో వైసీపీ ఎంపీల రాజీనామాల‌ను విమ‌ర్శిస్తూ టీడీపీ ఎమ్మెల్యేల‌తో, మంత్రులతో  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన‌ప్పుడు ఎగ‌తాళి చేస్తూ ఎట్టి ప‌రిస్థితిలో వారి రాజీనామాల‌ను లోక్ స‌భ‌లో ఆమోదంపొంద‌ద‌ని, మ‌ళ్లీ ఏపీలో ఉప ఎన్నిక‌లు జ‌రగ‌వ‌ని ఎద్దేవా చేశారు. కానీ ఊహించ‌ని ప‌రిణామాల దృష్ట్యా స్పీక‌ర్ కార్యాలయం నుంచి రాజీనామా చేసిన ఎంపీల‌కు పిలుపువచ్చింది. స్పీక‌ర్ పిలుపు మేర‌కు ఈ నెల 29 న‌ వైసీపీ ఎంపీలు ఢిల్లీకి బ‌య‌లుదేర‌నున్నారు. 
 
చ‌ట్ట ప్ర‌కారం  వైసీపీ ఎంపీలు రాజీనామాచేయ‌డానికి కారణం తెలుసుకునేందుకు వీలు కల్పించే ఒక నిబంధన ఉంది. ఈ నిభంద‌న ప్ర‌కారం ఎందుకు వారు రాజీనామా చేయాల‌నుకున్నారో స్పీక‌ర్ కు వివ‌రించాలి, ఆ త‌ర్వాత వివరణతో స్పీక‌ర్ సంతృప్తి చెందితే రాజీనామాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దీంతో క‌చ్చితంగా స్పీక‌ర్ వైసీపీ ఎంపీల రాజీనామాను ఆమోదిస్తార‌ని తెలిసి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ నాయ‌కుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇక మొత్తానికి వైసీపీ నాయ‌కులు టీడీపీ నాయ‌కుల డ్రామాల‌కు చెక్ పెట్టారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.