టీడీపీ దూకుడుకు చెక్ పెట్టిన వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:20:00

టీడీపీ దూకుడుకు చెక్ పెట్టిన వైసీపీ

వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్లు టీడీపీ చేస్తున్న తప్పులను, అవినీతిని ఎండగడుతూ నిముషాల్లో దేశమంతా చేరవేస్తున్నారు...దానిని చూసి భయపడిన టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్ లను భయపెట్టడానికి రెండు మూడు రోజులకోసారి అరెస్ట్ చేస్తున్నారు.చంద్రబాబు పాలనను గాలికి వదిలేసి నిజాలను ప్రజలు చేరేలా చేస్తున్న వైసీపీ సోసియల్ వాలంటర్స్ ను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు...
 
టీడీపీ చేయిస్తున్న అక్రమ అరెస్టులను అడ్డుకట్ట వేసి వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్ లకు భరోసా ఇచ్చేంది వైసీపీ ఒక అడుగు ముందుకు వేసింది...వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్లపై జరుగుతున్నా అక్రమ అరెస్టులను నిరోధించాలని పార్టీ సీనియర్ నాయకులు మల్లాది విష్ణు, పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి తదితరులు రాష్ట్ర డిజిపి మాలకొండయ్యకు విజ్ఞప్తి చేశారు...
 
టీడీపీ చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి చేరవేస్తున్నందుకే వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్లను టార్గెట్ చేసి, వేధిస్తున్నారని రాష్ట్ర డిజిపి మాలకొండయ్యకు తెలిపారు...అదే టీడీపీ సోషల్ మీడియా అసభ్యకరమైన పదాలు వాడుతూ పోస్ట్ లు చేసిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనతగ పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు...ఇకనైనా ఇలాంటివి జరగకుండా అడ్డుకట్ట వేసి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడాలని వారు డిజిపిని కోరారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాని డిజిపి హామీ ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.