బాల‌య్య అభిమానుల‌కు వైసీపీ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla balakrishna
Updated:  2018-06-18 03:39:29

బాల‌య్య అభిమానుల‌కు వైసీపీ చెక్

2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్షనేత‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్నారు. మ‌రో వైపు వైసీపీ నాయ‌కులు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానుల‌కు చెక్ పెట్టేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.
 
ముఖ్యంగా బాల‌య్య అభిమానులు ఎక్కువ శాతం అంత‌పురం జిల్లా, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఉన్నారు. అయితే ఈ నాలుగు జిల్లాల‌పై వైసీపీ ఫోక‌స్ పెట్టింది. అందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావ‌లిలో బాల‌య్య అభిమానుల‌పై వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టి సాధించారు. 
 
ఇప్ప‌టికే జిల్లాలో టీడీపీ ప్ర‌ధాన నాయ‌కుడు మ‌లిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లును అలాగే ఆయ‌న అనుచ‌రుల‌ను ప్ర‌తాప్ కూమార్ రెడ్డి వైసీపీలో చేర్చుకున్నారు. అంతేకాదు వారు వైసీపీలో చేర‌గానే వారి ఫొటోలతో  పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారిని ఎంక‌రేజ్ మెంట్ చేస్తూ వ‌స్తున్నారు.
 
ఇదే క్ర‌మంలో రీసెంట్ గా బాల‌య్య అభిమాన సంఘాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగితే అందులో ఓ అభిమాన సంఘ‌నాయ‌కుడికి గాయాలు త‌గిలాయి. అయితే ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తి వల్లెపు కిషోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌తాప్ కూమార్ రెడ్డి అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఆసుప‌త్రికి చేరుకుని అత‌న్ని ప‌రామ‌ర్శించారు. దీంతో జిల్లా మొత్తం ఈ విష‌యంపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ నాయ‌కులు ఒక ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప్లాన్ వేసి టీడీపీలో అసంతృప్తితో ఉన్న నాయ‌కులంద‌రిని వైసీపీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నారు. 
 
ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాలో అర‌కొర‌కు ఉన్న‌టీడీపీ నాయ‌కుల‌ను కూడా వైసీపీలో చేర్చేందుకు వైసీపీ నాయ‌కులు వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. మొత్తం మీద ఎన్నిక‌ల స‌మ‌యంలోపు మిగిలిన జిల్లాల్లో ఉన్న టీడీపీ, నంద‌మూరి అభిమానుల‌ను వైసీపీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.