బీజేపీ పొత్తుపై వైసీపీ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-07-14 03:03:52

బీజేపీ పొత్తుపై వైసీపీ క్లారిటీ

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా గుంటూరు జిల్లాలో గ్రామ‌ధ‌ర్శిని అనే పేరుతో ముఖ్య‌మంత్రి చేతులమీదుగా ఏర్పాటు చేయాలని నిర్ణ‌యించారు. ఈ గ్రామ‌ధ‌ర్శిని ఉద్దేశ్యం ఏంటంటే ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. 
 
అయితే తాజాగా ఈ గ్రామ‌ధ‌ర్శినిపై ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార‌ ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు స్పందించారు. ఈరోజు పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, నిజంగా టీడీపీ నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల‌కు చేయాల్సిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో స‌క్ర‌మంగా చేసి ఉంటే వారు ప్ర‌చారం చేసుకోవ‌ల్సిన అవరం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులు ఆర్భాటానికి పోయి ప్ర‌చారం చేసుకుంటున్నారు త‌ప్ప అమ‌లుచేస్తున్న‌టు వంటి కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు చేరువు కావ‌డం లేద‌ని ఈ గ్రామ‌ద‌ర్శిని ద్వారా అర్థం అవుతోంద‌ని అంబ‌టి ఆరోపించారు.
 
నిజంగా టీడీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు అందించేట‌టు వంటి ఓ ప‌థ‌కం ఏర్ప‌డితే దానిని ప్ర‌జ‌లే స్వీక‌రిస్తార‌ని, ఈ ప‌థ‌కాన్ని ప్ర‌జ‌లే ప్ర‌చారం చేస్తార‌ని ఆయ‌న అన్నారు. వారు ప్ర‌చారం చేయ‌డ‌మేకాదు మ‌ళ్లీ అదే ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌ని కోరుకుంటార‌ని అంబటి తెలిపారు. కానీ మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇవేమి చేయ‌కుండా కేవ‌లం ప్ర‌చార ఆర్భాటాలు చేసుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
గ‌తంలో ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో అనేక ప‌థ‌కాలు అమ‌లు చేశార‌ని అందులో 108 అంబులెన్స్, ఆరోగ్య‌శ్రీ, రైతు రుణ‌మాఫీ, 24 ఉచిత విద్యుత్ ల‌పై ఆయ‌న ఏ రోజు అయినా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం చేయ‌లేద‌ని ఈ ప‌థ‌కాల‌ను మెచ్చి తిరిగి 2009లో కూడా వైఎస్ ను ముఖ్య‌మంత్రి చేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు. 
 
చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో గ్రామ‌ద‌ర్శిని పేరుతో ప్ర‌చార ఆర్బాటాల‌కు పాల్ప‌డుతున్నారు త‌ప్ప ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అందించాల‌నే చిత్త‌శుద్ది లేద‌ని అంబ‌టి మండిప‌డ్డారు. అంతే కాదు 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు బీజేపీ నాయ‌కుల‌తో ర‌హ‌స్య ఒప్పందాల‌ను కుదుర్చుకుంటున్నార‌ని టీడీపీ నాయ‌కులు అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాము ఎట్టిప‌రిస్థితిలో పొత్తుపెట్టుకోమ‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.