ఎంపీ సీట్ల క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:22:37

ఎంపీ సీట్ల క్లారిటీ

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్రలో ఎవ‌రెవ‌రికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలి అనేది ఓ  జాబితా సిద్దం చేస్తున్నారు.పార్టీ త‌ర‌పున ఎవ‌రు యాక్టీవ్ గా ఉంటున్నారు అలాగే పార్టీ త‌ర‌పున ఎవ‌రు క‌ష్ట‌ప‌డుతున్నారు అనేది ఆయ‌న ముందు నుంచి స‌ర్వేల రూపంలో తెప్పించుకుంటున్నారు... ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఎవ‌రు పార్టీ త‌ర‌పున ఓడిపోయారు..ఆ ఓడిపోయిన వారు ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టారా పార్టీ ఎటువంటి స్ధితిలో ఉంది అనేది ప్ర‌తీదీ జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు... మ‌రో ప‌క్క ప్ర‌శాంత్ కిషోర్ టీం నుంచి నాయ‌కులు స‌ర్వే చేస్తున్నారు. ఇక సర్వేలు గ్రాఫులు ఎమ్మెల్యేల‌పై వైసీపీ త‌ర‌పున ముందుకు వెళుతున్నారు జ‌గ‌న్.
 
అయితే ఎంపీ స్ధానాల‌కు కూడా నాయ‌కులు ఇప్ప‌టికే రెడీ అయ్యారు అని తెలుస్తోంది... గ‌తంలో విశాఖ నుంచి త‌ల్లి విజ‌య‌మ్మ ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.. ఇప్ప‌డు ఈస్ధానం నుంచి కీల‌క నేత వైసీపీలో నిలుచోనున్నారు అని తెలుస్తోంది..విజ‌య‌న‌గ‌రం నుంచి బొత్సా ఝాన్సీ బ‌రిలోకి దిగ‌డం దాదాపు ఖాయం అని అంటున్నారు. ఇక తూర్పుగోదావ‌రి జిల్లా లో కాకినాడ నుంచి కుర‌సాల క‌న్న‌బాబుని పోటీ చేయించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స్థానాన్ని సినీ ప్ర‌ముఖుడికి కేటాయించే అవ‌కాశం ఉంది. ఇక అమ‌లాపురం నుంచి ఇక్క‌డ సామాజిక అంశాల‌ను అన్నింటిని ఆలోచించి  అమ‌లాపురం సీటును  హ‌ర్ష‌కుమార్ కు ఇవ్వాలి అని లేక‌పోతే కొత్త వ్య‌క్తిని నిల‌పాలి అని అనుకుంటున్నారు.
 
ఇక క‌డప నుంచి మ‌ళ్లీ సోద‌రుడు అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి నిలువ‌నున్నారు, ఇక నెల్లూరు నుంచి మేక‌పాటి, తిరుప‌తి నుంచి  వ‌ర‌ప్ర‌సాద్ లు వారి స్ధానాల నుంచి పోటీ చేయ‌డం ఖాయం.. అయితే ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆస్ధానం నుంచే పోటీ చేయ‌నున్నారా లేదా అసెంబ్లీకి వెళ‌తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక అన‌కాప‌ల్లి నుంచి అమ‌ర్నాథ్  నిల‌బ‌డ‌తారా లేదా కొణ‌తాల కూడా రంగ‌ప్ర‌వేశం చేస్తారా అనేది ఇక్క‌డ చూడాలి.
 
ఏలూరు స్థానాన్ని మ‌రో మాజీ ఐఏఎస్ అధికారి ఆశిస్తుండ‌గా, క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికే ఇక్క‌డ సీటు  కేటాయించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు అయితే కొట‌గిరి త‌న‌యుడు ఇక్క‌డ నుంచి పోటీకి సై మ‌రి జ‌గ‌న్ కూడా ఆయ‌న వైపే మొగ్గుచూపుతున్నారు.... ఇక న‌ర‌సాపురం ఎంపీ టికెట్  గ‌తంలో వంకా ర‌వీంథ్ర‌నాద్ కు ఇచ్చారు, ఆయ‌న త‌ణుకు -ఆచంట నుంచి అసెంబ్లీకి  పోటీ చేస్తారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.. అలాగే న‌ర‌సాపురం నుంచి గ‌తంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన ఆయ‌న‌కు సీటు ఇస్తార‌ని, ఆయ‌న క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు అని అంటున్నారు.
 
విజ‌య‌వాడ నుంచి ప్ర‌ముఖ నిర్మాతని రంగం లోకి దింపాలని జగన్ ఆలోచ‌న‌గా ఉందట. మ‌చిలీప‌ట్నం సీటు విష‌యంలో ఆలోచ‌న‌లో ఉన్నారు.. అయితే ఇక్క‌డ కొత్త వ్య‌క్తి క‌నిపించ‌నున్నారు అని తెలుస్తోంది... ఇక గుంటూరు నుంచి లావు ర‌త్త‌య్య వార‌సుడు కృష్ణ దేవ‌రాయ‌లకు సీటు ఫిక్స్ చేశారు జ‌గ‌న్.... అయితే అర‌కు విష‌యంలో మాత్రం వైసీపీ త‌రపున ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు... శ్రీకాకుళంలో రెడ్డి శాంతిని కాద‌నుకుంటే కిల్లి కృపారాణికి కండువా క‌ప్పేయ‌డం ఖాయం అనేది తెలిసిందే.. ఇక క‌ర్నూలు అనంత‌పురం, హిందూపురం,సీట్ల పై స్ప‌ష్ట‌త రావాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.