చంద్ర‌బాబు ఎక్క‌డ‌కాలుపెడితే అక్క‌డ ఇదే ప‌రిస్థితి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 19:25:59

చంద్ర‌బాబు ఎక్క‌డ‌కాలుపెడితే అక్క‌డ ఇదే ప‌రిస్థితి

ఏపీ ముఖ్య‌మంత్రి  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు తిరుప‌తిలోని తారకరామ స్టేడియంలో నమ్మకద్రోహం – కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.... అయితే ఈ స‌భ‌కు వ‌రుణుడు  స‌హ‌క‌రించలేదు.....
 
మ‌ధ్యాహ్నం నుంచి ఈదురు గాలుల‌తో కూడిన‌ వ‌ర్షం కుర‌వ‌డంతో ధర్మపోరాట స‌భ ఆల‌స్యంగా మొద‌లు పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది... ఈ క్ర‌మంలో సభకు విచ్చేసిన కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
 
ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్ర‌త్యేక విమానంలో అమ‌రావ‌తి నుంచి తిరుమల చేరుకున్నారు... ఆ త‌ర్వాత శ్రీవారి దర్శనం చేసుకుని  ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో పాల్గొనాలి, కానీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావ‌డంతో స‌భ కాస్త ఆల‌స్యంగా జ‌రుగ‌నుంద‌ని తెలుస్తోంది.
 
అయితే అదే విష‌యంపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు స్పందించారు.... ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు దీక్ష  న్యాయ బ‌ద్ద‌మైన‌ది కాదు కాబ‌ట్టే వెంక‌టేశ్వ‌రుడు కూడా అడ్డుకుంటున్నార‌ని అంటున్నారు...
 
చంద్ర‌బాబు ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ ఏదో ఒక ఆటంకం జ‌రుగుతోంద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు... మొన్న‌టికి మొన్న  ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యటన సమయంలోనూ  ఈదురు గాలులతో కూడిన వ‌ర్షం వ‌చ్చింద‌ని గుర్తు చేశారు...ఈ  వ‌ర్ష ప్ర‌భావానికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మరణించార‌ని గుర్తుచేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.