టీడీపీ చేతులు దులుపుకునే య‌త్నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-10 03:44:04

టీడీపీ చేతులు దులుపుకునే య‌త్నం

రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోధరలును వెంట‌నే త‌గ్గించాల‌పి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చూటి ఎమ్మెల్యే   శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ రోజు పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియాస‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఒక ప్ర‌క్క‌ సామాన్యుడు భరించలేనంతగా పెట్రో ధరలును పెంచుతున్న మోదీ ప్రభుత్వం ,మరో ప్రక్క  మన రాష్ట్రం లో కూడా  పెట్రోలు ,డీజల్ పై అత్యధికం గా పన్నులు వసూలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల‌ కంటే ఏపిలో రూ.5 నుంచి 7 రూపాయ‌ల‌వ‌ర‌కు అధికంగా ధరలు ఉన్నాయన్నారు. 
 
టీడీపీ నాయ‌కులు త‌మ ఖాజానాను నింపుకోవడానికి  అధికంగా పన్నులు వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో 4 శాతం వ్యాట్ తగ్గించారని, మహారాష్ట్ర లో కూడా తగ్గించారని అయితే అదేక్ర‌మంలో  ఏపీలో త‌గ్గిస్తే సామాన్యుడికి భారం తగ్గుతుందన్నారు. 
 
గ‌తంలో టీడీపీ, బీజేపీలు కలిసి ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో  పెట్రోలు ,డీజల్ రేట్లు తగ్గిస్తామని, డాలర్ విలువ తగ్గిస్తామని చెప్పారని, వీళ్ళ చేతగానితనం వల్లనే గరిష్ట స్థాయికి పెరిగాయన్నారు. పెట్రో రేట్లను అధికంగా పెంచి ప్రజల నడ్డివిరుస్తున్న బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు  తగిన  గుణపాఠం  చెప్పేందుకు ప్రజలు  సిద్ధంగా ఉన్నారన్నారు శ్రీకాంత్ రెడ్డి. చేసిందంతా చేసి  ఇప్పుడు  పెట్రో పెంపుపై  తెలుగుదేశం పార్టీ  నిరసన చేపట్టడం  విడ్డురం