విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 02:33:22

విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

త్వ‌ర‌లో ఖాళీ కానున్న రాజ్య‌స‌భ సీట్ల‌పై  తెలుగు రాష్ట్రాల్లో ప‌లువురు ప్ర‌ముఖులు ఆశ‌లు పెట్టుకున్నారు. తెలంగాణ‌లో ఖాళీ అవ‌నున్న రాజ్య‌స‌భ స్ధానాలు అన్నీ కూడా టీఆర్ ఎస్ పార్టీ భ‌ర్తీ చేయనుంది. ఎందుకంటే  కాంగ్రెస్ పార్టీకి  రాజ్య‌స‌భ సీటును గెలిపించుకునేందుకు కావాల్సిన  మెజారిటీ ఎమ్మెల్యేలు లేరు. ఇక ఏపీలో మాత్రం ప్ర‌తిపక్ష వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒకే ఒక్క‌ రాజ్య‌స‌భ సీటు గెలుచుకునేందుకు అవ‌కాశం ఉంది. 
 
దీంతో  వైసీపీ త‌ర‌పున వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డిని బ‌రిలో నిల‌బెడుతున్న‌ట్లు ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌క‌టించారు. త‌మ పార్టీకి  44 మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉంద‌ని విజ‌య‌సాయి రెడ్డి గుర్తు చేశారు. అయితే త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను  కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎంపీ టీజీ వెంట‌క‌టేష్ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. 
vemireddy ycp
 
య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావు హ‌వాలా ద్వారా డ‌బ్బులు స‌మ‌కూర్చే ప‌నిలో  ఉన్నార‌ని, అదే విధంగా అచ్చెన్నాయుడు విలువ‌లు లేని రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రాజ్య‌స‌భ సీటు గెలిచేందుకు కావాల్సింది కూడా  44 మంది ఎమ్మెల్యేలు. ఈ క్ర‌మంలో త‌మ ఎమ్మెల్యేలు ప్ర‌లోభాల‌కు గురి కాకుండా వైకాపా కాపాడుకోల‌దా లేదా అన్నది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.