వైకాపా సీనియర్ నేత మృతి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 10:14:34

వైకాపా సీనియర్ నేత మృతి

తెలుగు ప్రజలు మరో నాయకుణ్ణి కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే ఎం.వి. కృష్ణా రావు(87) అనారోగ్యంతో హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో బుధవారం మృతి చెందారు.

తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేసిన ఆయనకి చంద్రబాబు 2004 ఎన్నికల్లో టికెట్టు ఇవ్వకపోవడంతో దివంగత నేత yS చెంతకు చేరారు.అనంతరం నెలకొన్న రాజకీయ పరిణామాలతో వైకాపాలో చేరారు.

ఇచ్ఛాపురం సమన్వయకర్తగా పని చేసిన ఆయన అనారోగ్యం కారణంగా గత కొంత కాలం నుండి రాజకీయాలకు దూరంగా వున్నారు. కృష్ణా రావు కృష్ణా  జిల్లా పెద్దపాలుపర్రు గ్రామంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎ, పిహెచ్‌డి పూర్తి చేశారు.
 
తండ్రికి వ్యాపారరీత్యా సహకరిస్తూ ఇచ్ఛాపురంలో ఉన్న ఆయన 1982లో ఎన్‌టిఆర్‌ టిడిపి స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరి 1983 ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1985, 1989, 1999లో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా, మైన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, ప్యానల్‌ స్పీకర్‌గా పదవులు చేపట్టారు. ఆయన అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.