వైసీపీ నేత ఆత్మ‌హ‌త్యా య‌త్నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-16 04:57:02

వైసీపీ నేత ఆత్మ‌హ‌త్యా య‌త్నం

శ్రీకాకుళం జిల్లా సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వ‌ద్ద తాజాగా ఉద్రిక్త‌త నెల‌కొంది. ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత మాజీ ఎమ్మెల్యే సాయిరాజు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకోబోయారు. ఇటీవ‌లే తిత్లీ తుఫాను కార‌ణంతో పూర్తిస్థాయిలో దెబ్బ‌తిన్న రెండు జిల్లాల వాసులకు తాగునీరు ఆహారం అందించాలంటూ సాయిరాజు ఎమ్మార్వో కార్యాలయం వ‌ద్ద త‌న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్న ప్ర‌య‌త్నం చేశారు. 
 
అయితే అక్క‌డే ఉన్న పార్టీ కార్య‌క‌ర్త‌లు, పోలీసులు ఆయ‌న‌ను అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిత్లీ తుఫాను కార‌ణంగా రెండు జిల్లాలు పూర్తిగా న‌ష్ట‌పోయిన‌ప్ప‌టికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు వారికి స‌హాయ‌క చ‌ర్య‌లు అందించ‌డంలో విఫ‌లం అయింది. దీనిని నిర‌సిస్తూ గ్రామ‌స్తులంద‌రూ ఆందోళ‌న‌ చేప‌ట్టారు. అయితే ఈ ఆందోళ‌నకు వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. 

షేర్ :