చంద్ర‌బాబుపై మాజీ ఎంపీ వ‌ర ప్రసాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 13:35:34

చంద్ర‌బాబుపై మాజీ ఎంపీ వ‌ర ప్రసాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఈ రోజు పెద్ద ఎత్తున వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌ను చేప‌డుతున్నారు. ఈ దీక్ష‌లో ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం రాజీనామా చేసిన‌ తిరుప‌తి మాజీ ఎంపీ వ‌ర ప్ర‌సాద్ మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ముచ్చెమ‌లు ప‌ట్టించారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత గ‌ట్టిగా ఉందంటే అది కేవ‌లం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు లేకుంటే వైసీపీ లేద‌ని వారి మ‌ద్ద‌తుతోనే తాము కేంద్రం పై అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై పోరాడుతున్నామ‌ని వ‌ర‌ప్రసాద్ స్ప‌ష్టం చేశారు.
 
2014లో చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి దుర్మార్గ‌పు పాల‌నుకు అంతులేకుండా పోయింద‌ని, అయితే ఇందుకు ప్ర‌తీ ఒక్క‌రు న‌డుము బిగించాల‌ని మాజీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ తెలియ‌జేశారు. టీడీపీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదా కోసం మిత్రప‌క్షం వ‌హించకోకుండా కేవ‌లం వారి స్వ‌లాభాల కోసం నాలుగు సంవ‌త్స‌రాలు కేంద్రంతో మిత్ర ప‌క్షం వ‌హించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.