అవినీతిలో బాబు ఎన్నోస్థానంలో ఉన్నారో తెలుసా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-27 18:56:29

అవినీతిలో బాబు ఎన్నోస్థానంలో ఉన్నారో తెలుసా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాల నుంచి విచ్చ‌ల‌విడిగా అవినీతి కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎపీ వ‌ర‌ప్ర‌సాద్ రావు మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, నాలుగు సంవ‌త్స‌రాలుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అవినీతికి పాల్ప‌డ్డార‌ని తాము సాక్ష్యాల‌తో స‌హా రాష్ట్రప‌తికి  వివ‌రించామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
ఇప్పుడు ఆయ‌న చేసిన అవినీతిని క‌ప్పిపుచ్చ‌కుని మ‌ళ్లీ రాజ‌కీయ ల‌బ్ది చేకూర్చుకునేందుకు అనేక ఎత్తుగ‌డ‌లు వేస్తున్నార‌ని వ‌ర‌ప్ర‌సాద్ మండిప‌డ్డారు. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత రాష్ట్రాన్ని అభివృద్ది ప‌దంలో న‌డుపుదాం, విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత మొద‌టిసారి టీడీపీనే అధికారంలోకి వ‌చ్చింది క‌నుకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాగా మంచి ప‌రిపాల‌న చేసి ప్ర‌జ‌ల గుండెల్లో నిలుద్దాం అనే అలోచ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టిలో లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.
 
దేశంలో ఉన్న ముఖ్య‌మంత్రి మంత్రుల‌కంటే అతి ధ‌న‌వంతుడైన ముఖ్య‌మంత్రి ఎవ‌రంటే ఏపీ ముఖ్యంత్రి చంద్ర‌బాబు నాయుడ‌ని అన్నారు. అయితే ఈ మాట‌ను తాను చెప్పింది కాద‌ని సాక్షాత్తు ఎన్నిక‌ల సంఘాలే చెబుతున్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో రెండు ఎక‌రాల‌తో త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న సుదీర్ఘ రాజ‌కీయంలో అతి ధ‌న వంతుడు ఎలా అయ్యార‌ని వ‌ర‌ప్ర‌పాద్ ప్ర‌శ్నించారు. అంతేకాదు అవినీతిలో కూడా ఏపీనే మొద‌టి స్థానంలో ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. 
 
ఇలా ఎన్ని సంస్థ‌లు రాష్ట్రంలో స‌ర్వేలు చేసినా కూడా ఏపీ అవినీతిలో మొద‌టి స్థానంలోనే ఉంటుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే వీట‌న్నింటిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌ప్పు చెయ్య‌కుంటే స్టే తెచ్చుకోవాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.స్టే తెచ్చుకోకుండా ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించే అధికారం లేద‌ని వ‌ర‌ప్ర‌సాద్ ఆరోపించారు. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ దోషి అని ఏ కోర్టు కూడా నిర్ధారించ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
కేవ‌లం రాజ‌కీయ క‌క్ష సాదింపు కోస‌మే ఆయ‌న‌పై కేసులు పెట్టారని ద్వ‌జ‌మెత్తారు. అధికార బ‌లంతో టీడీపీ నాయ‌కులు పేద‌ప్ర‌జ‌ల‌కు అధిక వ‌డ్డీల‌కు డ‌బ్బులు ఇచ్చి వారు డ‌బ్బుల‌ను చెల్లించ‌లేని ప‌క్షంలో వారిని వ్య‌భిచారంలోకి దించి ఆ  త‌ర్వాత వారిని బ‌య‌పెట్టి బ్లూఫిలిమ్ చేయించే అంత దుస్తితికి వ‌చ్చింద‌ని ఇది ప్ర‌భుత్వమా అని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత రాజ‌ధాని చుట్టూ అవినీతి జ‌రుగుతోంద‌ని వ‌ర‌ప్ర‌సాద్ మండిడ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.