హోదా కోసం జ‌గ‌న్ సాహ‌సం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-13 10:26:55

హోదా కోసం జ‌గ‌న్ సాహ‌సం

ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కార్య‌చ‌ర‌ణ  సిద్దం చేశారు. ప్రజా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ సోమ‌వారంనాడు సాయంత్రం పార్టీ నేత‌ల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. 
 
కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చేందుకు మార్చి 1 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా క‌లెక్ట‌రేట్ల ఎదుట‌ ధ‌ర్నాలు నిర్వ‌హించాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. ప్ర‌త్యేక హోదా మ‌న హ‌క్కు- ప్యాకేజీతో మోస‌పోవ‌ద్దు అనే నినాదంతో ధ‌ర్నాలు చేయనున్న‌ట్లు ప్ర‌క‌టించారు వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. 
 
ఇక మార్చి 5న  హోదా మ‌న‌హ‌క్కు-ప్యాకేజి మాకొద్దు అనే నినాదంతో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద పార్ల‌మెంట్ స‌భ్యులు, ఎమ్మెల్యేలు, నేత‌ల‌తో క‌లిసి ధ‌ర్నా చేసేందుకు వైసీపీ స‌న్న‌ద‌మైంది. ఇందుకోసం మార్చి 3న అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జెండా ఊపి నాయ‌కుల‌ను ఢిల్లీకి పంపించ‌నున్నారు. 
 
ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న ఈ పోరాటంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు  చ‌లించ‌ని ప‌క్షంలో గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు  ఎంపీల  చేత రాజీనామాలు చేయించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు వైసీపీ ప్ర‌టించింది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏకంగా ఢిల్లీ పెద్ద‌ల‌తోనే ఢీ కొట్టేందుకు సిద్ద‌మ‌య్యారు వైయ‌స్ జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.