సీఎం ర‌మేష్ కు వైసీపీ సూటి ప్ర‌శ్న‌?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-20 16:32:39

సీఎం ర‌మేష్ కు వైసీపీ సూటి ప్ర‌శ్న‌?

మ‌నం చేస్తే సంసారం అవ‌త‌ల వాడు చేస్తే సెన్సార్ అనే ప‌దం వాడ‌తారు తెలిసిందే.. ఇప్పుడు సీఎం ర‌మేష్ చేసే ఆమ‌ర‌ణ పోరు క‌డ‌ప‌లో పొలిటిక‌ల్ హీట్ ఎలా పెంచుతుందో స‌ర్వం తెలిసిందే.. ఏకంగా నాలుగు సంవ‌త్స‌రాలు మౌనం వ‌హించిన తెలుగుదేశం ఆస్దాన నాయ‌కుల్లో సీఎం ర‌మేష్ ముఖ్యుడు..ఈ నాలుగు సంవ‌త్స‌రాలు ఎటువంటి మాట కూడా మాట్లాడ‌లేదు సీఎం ర‌మేష్ అనే ఈ రాజ్య‌స‌భ ఎంపీ..
 
రెండోవ ప‌ర్యాయం సీఎం ర‌మేష్ కు, సీఎం చంద్ర‌బాబు ఎంపీ ప‌ద‌వి ఇచ్చి మ‌రీ ఏపీకి కావాల్సిన ప‌నులు చేయించ‌డంతో ముందు ఉంటారు అనుకుంటే, విజ‌య‌సాయిరెడ్డి జ‌గ‌న్ ఆ ప‌నిచేస్తున్నారు ఇలా న‌మ‌స్కారం చేస్తున్నారు, అక్క‌డ టీ తాగారు అనేలా మాట‌లు తూటాలు వ‌దిలారు, మిన‌హా చేసింది ఏమైనా ఉంది అంటే ప‌త్రిక‌ల్లో అచ్చువేసిన వార్త‌ల‌లానే మిగిలిపోయింది సీఎం ర‌మేష్ రాజ‌కీయం.
 
అయితే ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం ప‌క్క‌న పెట్టి తెలుగుదేశం కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై క‌దం తొక్కింది..విభ‌జ‌న హామీలు అలాగే క‌డ‌ప ఉక్కు ప‌రిశ్రమ సాధ‌న కోసం సీఎం ర‌మేష్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష పై ఇప్పుడు  స‌ర్వ‌త్రా  చ‌ర్చ జ‌రుగుతోంది..ముఖ్యంగా సీఎం ర‌మేష్ కు జిల్లా టీడీపీ, రాయ‌ల‌సీమ టీడీపీ స‌పోర్ట్ ఉన్నా, ఇటు కొంద‌రు మాత్రం ఆయ‌న దీక్ష‌పై కామెంట్లు చేస్తున్నారు ఎన్నిక‌ల ఫీట్లు అంటున్నారు.
 
ఇటు ఎల్లో మీడియాలో కూడా సీఎం ర‌మేష్ కు జాతీయ స్దాయిలో మ‌ద్ద‌తు వ‌స్తోంద‌ని ప్ర‌చారం కూడా చేస్తున్నాయి...కడపకు ఉక్కు పరిశ్రమను తీసుకురావడం కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని సీఎం ర‌మేష్ ఇటీవ‌ల మీడియాతో అన్నారు. అయితే సుప్రీం కోర్టు ఇటీవ‌ల ఇచ్చిన అఫిడ‌విట్ లో ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ్యం కాదు అని కేంద్రం ఓ మాట‌గా తేల్చేసింది..
 
అయితే ఇటు వైసీపీ నేత‌లు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసిన స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ నాట‌కాలు అని ఇదే కామెంట్లు చేసిన తెలుగుదేశం, ఇప్పుడు సీఎం ర‌మేష్ విష‌యంలో వెన‌కేసుకు వ‌స్తోంది.. మావి నాట‌కాలు అన్న మీవి ఏమిటి అని వైసీపీ ప్ర‌శ్నిస్తోంద‌ట‌..రాజ‌కీయంగా హీట్ పుట్టిస్తున్న అంశ‌మే ఇది.. చూడాలి.. సీఎం ర‌మేష్ వి ఫీట్లా లేదా క‌డ‌ప ఉక్కుకోసం నిజ‌మైన పోరాటాలా అనేది  త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.