అద్దంకి సినిమా ముందు ఉంది - వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 16:53:44

అద్దంకి సినిమా ముందు ఉంది - వైసీపీ

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌కాశం జిల్లా పై మ‌రింత ఫోక‌స్ పెట్టారు.. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఇక్క‌డ అత్య‌ధిక స్దానాలు గెలుచుకోలేక‌పోయింది.. అయితే -నెల్లూరు -ప్ర‌కాశం -క‌ర్నూలు ప్రాంతాలు వైసీపీకి పట్టుకొమ్మ‌ల్లా గ‌త ఎన్నిక‌ల్లో ఫలితాలు చూపాయి..త‌ర్వాత క‌ర్నూలు ప్ర‌కాశం జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌ను తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించేలా చేశారు అధినేత.. అయితే పార్టీ మారిన వారిలో ఇటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ కూడా తెలుగుదేశంలో చేరారు.
 
ఆయ‌న మంత్రి ప‌ద‌వి కూడా ఆశించారు..ఇటు ప్ర‌త్య‌ర్ది వ‌ర్గం నుంచి క‌ర‌ణం ఉండ‌టం మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి కుద‌ర‌లేదు.. ఇక వీరి వైరం ఎప్ప‌టి నుంచో ఉంది.. ఇక తెలుగుదేశం త‌ర‌పున ఓట‌మి పాలైన క‌ర‌ణం ఫ్యామిలీకి రాజ‌కీయంగా ఇక్క‌డ చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చినా, తెలుగుదేశం పార్టీలో లుక‌లుక‌లు మ‌రింత బ‌య‌ట‌ప‌డ్డాయి అద్దంకి సెగ్మెంట్లో.
 
అయితే వైసీపీ త‌ర‌పున అద్దంకి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా ఉన్న శ్రీ బాచిన చెంచు గరటయ్య కి ఇప్పుడు ప్రజా మ‌ద్ద‌తు బాగానే వ‌స్తోంది.. జిల్లాలో అద్దంకి రాజ‌కీయానికి ఓ బ్రాండ్ ఉంది.. ముఖ్యంగా అద్దంకిలో క‌ర‌ణం వ‌ర్సెస్ గొట్టి పాటి అనే పేరు ఎప్ప‌టి నుంచో నిలిచిపోయింది.. క‌ర‌ణం వ‌ర్గానికి గొట్టిపాటి  ర‌వి రాజకీయంగా మ‌రింత వైరంగా మారారు.. ఇటు తెలుగుదేశంలో చంద్ర‌బాబుతో స‌మానంగా క‌ర‌ణం కూడా రాజ‌కీయాల్లో అడుగుపెట్టారు.
 
అయితే ఇక్క‌డ గొట్టి పాటీ వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలోకి వెళ్లిన త‌ర్వాత .తెలుగుదేశం త‌ర‌పున అద్దంకి బాధ్య‌త‌ల‌ను కూడా చంద్ర‌బాబు గొట్టిపాటి ర‌వికి అప్ప‌గించారు.. దీంతో అప్ప‌టి నుంచి  క‌ర‌ణం కుమారుడు వెంక‌టేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు  ప్ర‌శార్ద‌కంగా మారింది.. క‌ర‌ణం బ‌ల‌రాం  ఎమ్మెల్సీగా కొన‌సాగుతూ ఆయ‌న కుమారుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి ఎమ్మెల్యే  టికెట్ టీడ‌పీ త‌ర‌పున  ఇప్పించుకోవాలి అని ఆలోచ‌న‌లో ఉన్నారు.
 
అయితే ఇటు పార్టీ త‌ర‌పున టికెట్ ఇవ్వ‌క‌పోతే వైసీపీలో ఆ కుటుంబం చేరే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.. ఇటు క‌ర‌ణం ఫ్యామిలీకి వైసీపీ త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. అందుకే క‌ర‌ణం ఫ్యామిలీతో ఆచితూచి అడుగులేస్తున్నారు చంద్ర‌బాబు... ఇటు ప్ర‌స్తుతం ఉన్న వైసీపీ ఇంచార్జ్ కు సీటు ఇచ్చినా , తెలుగుదేశం త‌ర‌పున వీరి ఇద్ద‌రిలో ఎవ‌రు నిల‌బ‌డినా గెల‌వ‌గ‌లారా అనే ప్ర‌శ్న మెదులుతుంది..
 
గ‌ర‌ట‌య్య  ప్ర‌జాక్షేత్రంలో బాగానే వెళుతున్నా సిట్టింగ్ స్ధానం కాబ‌ట్టి అవ‌కాశం ఉంటుంది అని విశ్లేష‌కులు చెబుతున్నారు...సో ఇంకా గ్రామాల్లో వైసీపీ మ‌రింత బ‌లంగా వెళ్లాలి ..ఇటు ఇద్ద‌రు బ‌డా నాయ‌కులు తెలుగుదేశంలో సీటు కోసం పోట్లాడ‌టం ఖాయం.. వ‌చ్చే రోజుల్లో ఏమైనా ఈ సెగ్మెంట్లో రాజ‌కీయ పందాలో జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే ఇక్క‌డ ముందుంది అస‌లు సినిమా.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.