ప‌శ్చిమ వైసీపీలో ఆ సెగ్మెంట్ స్ట్రాంగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 15:16:34

ప‌శ్చిమ వైసీపీలో ఆ సెగ్మెంట్ స్ట్రాంగ్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 15 సెగ్మెంట్లు 2 ఎంపీ స్దానాల్లో గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పంచ్ ప‌టాకాలా విజ‌యం సాధించింది.. మొత్తం క్లీన్ స్వీప్ చేసి ఓ చ‌రిత్ర సృష్టించింది.. అయితే అధికార పార్టీకి ఇక్క‌డ పోల‌వ‌రం అంశం మెయిన్ అయితే, బీసీ ఓటు బ్యాంకు, కాపు ఓటు బ్యాంకు మ‌త్స్య‌కారుల ఓట్లు ప్ల‌స్ అయ్యాయి... ఇటు న‌ర‌సాపురం రీజియ‌న్లో కూడా బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నా టీడీపీ అల‌వోక‌గా విజ‌యం సాధించింది. అయితే ఇక జిల్లాలో త‌ణుకు గురించి ఇక్క‌డ చ‌ర్చించుకోవాలి.
 
మినీ గుజ‌రాత్ గా ఇక్క‌డ పిలుస్తారు.. పెద్ద పెద్ద ప‌రిశ్ర‌మ‌లకు, కొత్త ఇండ‌స్ట్రీల‌కు నెల‌వైన ప్రాంతం.. ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్ గా జిల్లాలో ఏలూరు త‌ణుకు ముందు వ‌ర‌సలో ఉంటాయి.. ఆక్వా ప‌రిశ్ర‌మ అంతా భీమ‌వ‌రం అయితే ఇటు నూలు, షుగ‌ర్, హెయిర్ కెమిక‌ల్ ఇండ‌స్ట్రీలు స్మాల్ స్కేల్ ఫార్మాలు ఉన్న ప్రాంతం త‌ణుకు.
 
ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జ‌గ‌న్ సీటును చీర్ల రాధ‌య్యకు ఇచ్చారు.అయితే తెలుగుదేశం త‌ర‌పున ఆరిమిల్లి రాధాకృష్ణ నిలుచున్నారు.. అయితే ఇక్క‌డ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి మైన‌స్ అయింది అనేది ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు తేలిపొయింది.. ఇక చీర్ల రాధ‌య్య కొన్ని రోజులు పార్టీలో యాక్టీవ్ గా ఉన్నా త‌ర్వాత ఆయ‌న ప‌క్కకు వెళ్లిపోయారు.. త‌ర్వాత ఇక్క‌డ కారుమూరి నాగేశ్వ‌రార‌వుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు జ‌గ‌న్. గ‌తంలో కారుమూరి నాగేశ్వ‌రావును దెందులూరు పంపి అక్క‌డ ఎమ్మెల్యేగా పోటీచేయించారు. కాని కారుమూరికి చింత‌మ‌నేని చేతిలో ఓట‌మి వ‌చ్చింది.
 
అయితే ఇక్క‌డ మ‌రో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు జ‌గ‌న్ నుంచి సీటుఆశిస్తున్నారు తణుకు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి  .. అలాగే ఓ ప్ర‌ముఖ డాక్ట‌ర్ ఎన్నారై కుటుంబం కూడా తెర‌వెనుక సీటు కై ప్ర‌య‌త్నాలు చేశారు.. కాని చివ‌ర‌కు కారుమూరికే జ‌గ‌న్ సీటు ఫైన‌ల్ చేశారు అని ఇక్క‌డ వైసీపీ కేడ‌ర్ కు కూడా స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తెలిసింది.
 
ఇక గ‌త ఎన్నిక‌ల్లో 30 వేల మెజార్టీ తెలుగుదేశానికి వ‌చ్చింది త‌ణుకులో... కౌన్సిల్ లో కూడా ఇక్క‌డ టీడీపీ హావా కొన‌సాగుతోంది.. ముఖ్యంగా ఇక్క‌డ వైసీపీ బ‌ల‌ప‌డినా క్షేత్ర స్ధాయిలో మ‌రింత బ‌ల‌ప‌డాలి.. ఇటు ఆరిమిల్లిపై ఇటీవ‌ల వ‌చ్చిన విమ‌ర్శ‌లు మైన‌స్ అయినా ఆర్దికంగా బల‌మైన సామాజిక‌వ‌ర్గం  ఇక్క‌డ క‌మ్మ సామాజిక వ‌ర్గం... పోటా పోటిగా కాపు క‌మ్మ వ‌ర్గాలు పొలిటిక‌ల్ వార్ లో ఉంటాయి... అయితే వైసీపీ ఇక్క‌డ ప‌ల్లె ప‌ల్లెకు యాత్ర చేస్తే బాగుంటుంది అని కొంద‌రు సూచించారు... బ‌హుశా త‌ణుకు లో జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అయింది కాబ‌ట్టి జ‌గ‌న్ ఆదేశాల‌తో కారుమూరి ఇటువైపు ఆలోచ‌న చేస్తే కాస్త పార్టీకి మ‌రింత ప్ల‌స్, న‌వ‌ర‌త్నాలు కూడా మ‌రింత ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే అవ‌కాశం ఉంటుంది. అని కేడ‌ర్ అలాగే విశ్లేష‌కుల భావ‌న‌.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.