గౌత‌మ్ రెడ్డికి వైసీపీ ఊహించ‌ని షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-11 11:06:59

గౌత‌మ్ రెడ్డికి వైసీపీ ఊహించ‌ని షాక్

విజ‌య‌వాడ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో గ‌త కొన్ని రోజులుగా నెల‌కొన్న సందిగ్ద‌తకు తెర‌ప‌డింది. వంగ‌వీటి రంగాపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినందుకు గానూ  వైసీపీ నేత గౌతం రెడ్డిని పార్టీ అధిష్టానం స‌స్పెండ్ చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 
 
అయితే గౌతం రెడ్డి ఇటీవ‌ల పాదయాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌ల‌వ‌డం గ‌మ‌నార్హం. దీంతో పాటు    స‌స్పెండ్   చేసిన‌ట్లు త‌న‌కు ఎలాంటి నోటీసులు  లేద‌ని, నేను కూడా మీలాగా వార్త ఛాన‌ల్ లో మాత్ర‌మే చూశాన‌ని, మున్ముందు పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గోన‌బోతున్నానని   గౌతం రెడ్డి తాజాగా  మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంగా మ‌రింది. 
 
దీంతో  గౌతం రెడ్డికి వైసీపీతో ఎలాంటి సంబంధం  లేదంటూ ఇప్పుడు పార్టీ   అదిష్టానం నుండి ఓ ప్ర‌క‌ట‌న అధికారికంగా విడుద‌ల అయింది.  గౌతం రెడ్డి  వైసీపీ స‌భ్యుడు కాదు...ఆయ‌న్ను గ‌తంలోనే పార్టీ నుండి సస్పెండ్ చేయ‌డం అంద‌రికీ తెలిసిందే అంటూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి పేరు మీద ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల అయింది. 
 
ycp

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.