వైసీపీ ఆ ఐదు సీట్ల పై మూడు నెల‌ల్లో ఫైన‌ల్ ప్ర‌క‌ట‌న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 15:07:42

వైసీపీ ఆ ఐదు సీట్ల పై మూడు నెల‌ల్లో ఫైన‌ల్ ప్ర‌క‌ట‌న‌

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌పున పాద‌యాత్ర‌లో దూసుకుపోతున్నారు... ఇటు ప్రజా సంక‌ల్ప‌యాత్ర రెండు వంద‌ల రోజులు ఇప్ప‌టికే  పూర్తి చేసుకుంది..ఇక ఉత్త‌రాంధ్రా కు కూడాచేరువ‌లో ఉంది జ‌గ‌న్ పాద‌యాత్ర... అయితే ఇటు పాద‌యాత్ర పూర్తి చేసుకుంటున్న ప్రాంతాల్లో, వైసీపీ కి జ‌నంలో ఎటువంటి ప‌ల్స్ ఉంది, జ‌నం ఏమి అనుకుంటున్నారు అనేది పీకే టీం ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేద్వారా 48 గంట‌ల్లో స్ప‌ష్ట‌మైన రిపోర్టుల‌ను సేక‌రిస్తోంది.
 
ఇటు జ‌గ‌న్ పాదయాత్ర ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పూర్తి అయిన విష‌యం తెలిసిందే.. ఆయ‌న పాద‌యాత్ర‌కు ఇక్క‌డ ప్ర‌జ‌లు విశేషంగా త‌ర‌లి వ‌చ్చారు... అయితే తెలుగుదేశం పార్టీ త‌ర‌పున  నాయ‌కులు మాత్రం జిల్లాలో ఇక్క‌డ ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు నీరాజ‌నాలు ప‌ల‌క‌లేదు అని అస‌త్య  వ్యాఖ్య‌లు చేశారు...అయితే వైసీపీ దీనికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.. ఇటు జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌లు పెట్టిన చోట ఎమ్మెల్యేలు జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డారు.. పాల‌కొల్లు ఎమ్మెల్యే , న‌ర‌సాపురం ఎమ్మెల్యే భీమ‌వ‌రం ఎమ్మెల్యే, ఆచంట ఎమ్మెల్యే, త‌ణుకు ఎమ్మెల్యే కూడా జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డారు.
 
అయితే జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప‌లువురు అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించారు...ముఖ్యంగా న‌ర‌సాపురం, ఆచంట‌, త‌ణుకు, దెందులూరు, ఏలూరు సెగ్మెంట్ల పై జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న అంద‌రికి ఆనందం క‌లిగించింది... ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా జ‌గ‌న్ సెగ్మెంట్ల వారిగా ఎవ‌రెవ‌రికి ప్ర‌జా మ‌ద్ద‌తు ఉంది అనేది తెలుసుకుంటున్నారు... ఇక ఐదు సెగ్మెంట్ల‌లో ఇద్ద‌రు చొప్పున నాయ‌కులు ఉన్నారు, వారి పై స‌ర్వే ద్వారానే అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టిస్తారు అని తెలుస్తోంది. 
 
ఇక మ‌రో ఐదు సెగ్మెంట్ల‌లో ఇప్ప‌టి కంటే బ‌ల‌మైన అభ్య‌ర్దుల‌ను ఇక్క‌డ నిల‌బెట్టాల‌ని స‌ర్వే టీం తెలియ‌చేసింది.. ఇక మ‌రో మూడు నెల‌ల్లో వారి ఎంపీక కూడా పార్టీ త‌ర‌పున ఉంటుంది అని అంటున్నారు జిల్లా నాయ‌కులు.. ఏమైనా జిల్లా నుంచి ఎమ్మెల్సీ  ఆళ్ల‌నాని కూడా ఈ సారి సీట్ల విష‌యంలో కీల‌క పాత్ర పోషిస్తారు అని జిల్లాలో వార్త‌లు వ‌స్తున్నాయి.. ఆయ‌న తొలినుంచి జ‌గ‌న్ కు వెన్నంటి  పార్టీలో ఉన్న విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.