రోజు రోజుకు మారుతున్న సమీకరణాలు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan image 6
Updated:  2018-03-11 01:28:52

రోజు రోజుకు మారుతున్న సమీకరణాలు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్ధితుల‌ను బ‌ట్టి చూస్తే, గ‌తంలో ప్ర‌జ‌లు అనుకున్న విధంగా, 2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పయనిస్తున్న‌ట్లు తెలుస్తోంది... 2014  లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నా కానీ, అప్పుడు చంద్రబాబు మేధోమధనం చేసి అనేక హామీల‌తోపాటు మోడీ, పవన్ కళ్యాణ్ అండ‌తో కేవలం ఐదు శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని చేజిక్కించ్చుకున్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.
 
అయితే అప్పటి పరిస్థితులను ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే...
1.రాష్ట్రం విడిపోవడంతో, రాష్ట్ర ఆర్ధిక, సామాజిక,భౌగోళిక వంటి ప‌లు అంశాల‌పై అవగాహన లేదని, ఇలాంటి ప‌రిస్ధితుల్లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావడానికి గల రాజకీయ అనుభవం కూడా లేదని, రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు ప‌ట్టం క‌ట్టారు ప్ర‌జ‌లు.
 
2.రుణమాఫీతో రైతులని, డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలని, నిరుద్యోగ భృతి అనే పేరుతో యువకుల్ని, ఇలా పలు అంశాలతో చంద్రబాబు ఆకట్టుకోవడంతో జగన్ కి భంగపాటు కలిగింది.
 
3. పవన్ కళ్యాణ్ ను వాడుకుని, రాజకీయం చేసి ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకున్నారు.
 
4.బీజేపీ తో పొత్తు, ప్రత్యేక హోదా అనే నినాదం, మోడీకు ప్రజల్లో ఉన్న ఆకర్షణతో చంద్రబాబు అధికారం దక్కించుకున్నారు..
 
5. హైటెక్ సిటీని కట్టాలంటే నాలాంటి అనుభవం కలిగిన వాళ్ళకే సాధ్యం అని చెప్పి మభ్యపెట్టడం...
 
అయితే ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది...దానికి గల కారణాలను విశ్లేషిస్తే...  
 
1.ప్రతిపక్ష నేతగా, అసెంబ్లీలో పోల‌వ‌రం, రుణ మాఫీ, డ్వాక్రా మ‌హిళా రుణాలు, రాష్ట్ర జీడీపి లెక్కలు.. ఇలా ప్ర‌తి అంశం పై వివ‌రంగా, అనర్గళంగా మాట్లాడడంతో, పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిలా పరిపూర్ణత చెందడం..
 
2. వైసీపీ రైతుల రుణమాఫీ చేయడం అసాధ్యం అని చెప్పి ఎన్నికలకి వెళ్లడంతో, వైసీపీ పార్టీకి ప్రజల పట్ల ఉన్నఅంకితభావాన్నిరుణమాఫీ జరగకపోవడంతో ప్రజలు గుర్తించడం.
 
౩.ప్ర‌త్యేహ హోదాని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్ చేస్తున్న పోరాటం ప్రజల్లోకి వెళ్లడంతో ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టిన చంద్రబాబు బయపడి ప్ర‌త్యేక హోదా వైపు యూ టర్న్ తీసుకోవడం...
 
4. 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క దానిని కూడా అధికార పార్టీ నెరవేర్చక పోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉండటం..
 
5. ప్రతి అంశంపైనా పూటకో మాట మాట్లాడుతూ...రెండు నాలుకల ధోరణిని అవలంబించడంతో ప్రజలు మండిపడుతున్నారు...
 
6. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు, ఎన్నో ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న అధికార పార్టీ నాయ‌కులే స‌మాధానం ఇవ్వ‌లేక పోవడం...
 
7. బీజేపీ నేతలు యూటర్న్ తీసుకుని, టీడీపీ నేతల పైనే విమర్శలు చేయడం. 
 
8 . ఇక చివ‌రిగా నాలుగేళ్ళ నుండి టీడీపీ చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రజలు గమనిస్తుండడం...
 
ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే వైసీపీ 2019 లో ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయం....

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.