వైసీపీ సిద్ద‌మేనా...?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 15:07:46

వైసీపీ సిద్ద‌మేనా...?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు మ‌రి కొన్ని నెల‌ల్లో కొత్త పుంత‌లు తొక్క‌నున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌జ‌ల్లో ఎవ‌రి బ‌లం ఎంతుందో  పార్టీలు పరిక్షీంచుకోనున్నాయి. మరి కొన్ని నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి...ఈ నేపథ్యంలో టీడీపీ ఎత్తుగ‌డ‌ల‌ను ఎదుర్కునేందుకు వైసీపీ సిద్దంగా ఉందా....? 
 
విభ‌జ‌న త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిన‌వే. ఇటీవ‌ల నంద్యాల ఉప ఎన్నిక‌ల‌తో పాటు,  కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ ఓట్ల శాతంలో మాత్రం  వైసీపీ త‌న బలమేంటో తెలుసుకుంది. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీ విజ‌యం సాధించాలంటే మ‌రింత చెమ‌టోడ్చాలి అన్న విష‌యం బ‌హిర్గ‌తం అయింది. 
 
ఈ క్ర‌మంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందే వచ్చే పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ భూత్ స్థాయిలో అధికార పార్టీతో పోటీ పడాల్సి ఉంటుంది.. చంద్రబాబు భూత్ లెవెల్ లో ఓటర్లను మేనేజ్ చేయడంలో దిట్ట అందుకే వైసీపీ కూడా దీనిపైనా దృష్టి పెట్టాల్సి ఉంది...
 
ఈ రెండు ఎన్నికలు జరిగినప్పుడు రాజకీయ పరిణామాలు వేరు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వేరు ఎందుకంటే జగన్ ప్రజాసంకల్ప యాత్రతో అప్పటికంటే ఇప్పుడు భూత్ స్థాయిలో బలంగానే ఉంది అనే చెప్పాలి.. దానికి తోడు టీడీపీ యూ -టర్న్ రాజకీయాలు కూడా వైసీపీకి కలిసివచ్చే అవకాశం ఉంది.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, హత్యచారాలు, టీటీడీ అవకతవకలు ఇలా ప్రతి విష‌యంలోనూ టీడీపీ ఇరుకున పడింది...
 
సాధార‌ణంగా ఇలాంటి ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు ఎక్కువ సార్లు అధికార పార్టీనే విజ‌యం సాధించ‌డం జ‌రుగుతుంది. అంతేకాకుండా స్ధానికంగా పోటీ చేసే అభ్య‌ర్ధి మీద ఫ‌లితాలు ఆధార‌ప‌డి ఉంటాయి. కానీ ఇప్పుడు టీడీపీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూస్తే పంచాయతీ ఎన్నికలలోనే టీడీపీకి షాక్ తగిలే అవకాశం ఉంది.
 
అయినప్పటికీ ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌తిపక్ష పార్టీగా కొన‌సాగుతోన్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ ఎన్నిక‌లు ఎంతో కీల‌కంగా మార‌నున్నాయి. ఇప్ప‌టికే 2014 ఎన్నిక‌ల్లో అధికారాన్ని చేజిక్కించుకోలేక‌పోయిన వైసీపీ, వచ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికార ప‌గ్గాలు చేప‌ట్టాల‌నే దృఢ సంక‌ల్పంతో ముందుకు సాగుతోంది. 
 
ఈ క్ర‌మంలో అధికార పార్టీ వ్యూహాల‌ను తిప్పి కొట్టి 2019 ఎన్నిక‌ల‌కు ముందే జ‌రిగే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప‌ట్టును నిలుపుకునేందుకు ప్ర‌య‌త్నించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందుకోసం వైసీపీ శ్రేణులు క్షేత్ర స్ధాయిలో తీవ్రంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. 
 
నంద్యాల, కాకినాడ ఎన్నికలలో అధికార అండతో ప్రలోభాలకు గురిచేసిందని ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. మళ్ళి అలాంటి ప్రయత్నమే అధికార పార్టీ చేస్తే దానిని తిప్పికొట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉండాలి. టీడీపీ స‌ర్కార్ తో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌రానికి సిద్దంగా ఉండాలి..... రానున్న రోజుల్లో ప్ర‌జ‌లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనే విషయాలు తెలియాలంటే మ‌రికొన్ని నెల‌లు వేచి చూడాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.