టీడీపీ ఓట‌మీ ఖాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mlas
Updated:  2018-05-31 06:26:18

టీడీపీ ఓట‌మీ ఖాయం

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో టీడీపీ బ‌లం ఎంత ఉందో అన్న సందేహంతో స‌ర్వేల మీద స‌ర్వేలు చేయిస్తూనే ఉన్నారు. కానీ రిజ‌ల్ట్స్‌ మాత్రం పార్టీకి అనుకూలంగా రావ‌డంలేదు. అయితే అందుకు కార‌ణం అభివృద్ది పార్టీ త‌రపున టీడీపీ ఎమ్మెల్యేలు వారి నియోజ‌క వ‌ర్గానికి నిధులను విడుద‌ల చేయించుకున్నా కానీ, వాటిని అమ‌లు చేయ‌డంలో సైకిల్ పార్టీ నాయ‌కులు పూర్తిగా విఫ‌లం అయ్యారు. దీంతో చంద్ర‌బాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేల‌తో అత్య‌వ‌ర స‌మావేశం ఏర్పాటు చేసి వారికి క్లాస్ తీసుకుంటున్నార‌ట‌. 
 
ఇక మ‌రో వైపు కొంత‌మంది టీడీపీ నాయ‌కులు తాము ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లాలోను అలాగే వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజ‌కవ‌ర్గాల్లో టీడీపీ నాయ‌కులు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు తెగ ఆరాట‌ప‌డుతున్నార‌ట‌. అయితే వారి ఆరాటాని చెక్ పెట్టింది ఓ కీల‌క స‌ర్వే.
 
రాజ‌కీయ నాయ‌కుల‌తో ఎవ‌రితోనైనా పోటీ ప‌డ‌వ‌చ్చు కానీ ప్ర‌జా బ‌లం ఉన్న నాయ‌కుడితో మాత్రం పెట్టుకోకూడ‌దు అనే మాట‌ను పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇది అక్షరాల‌ స‌త్యం ఎన్ని త‌రాలు మారినా కానీ ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డి గెలించుకున్న వ్య‌క్తిని మాత్రం వ‌ద‌ల‌రు. అలాంటి వారు వైసీపీలో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని ఓ కీల‌క స‌ర్వేలో తేలింది.
 
2014 లో ఈ 20 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌పై పోటీ చేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. అయితే  వారు నియోజ‌కవ‌ర్గంలో ఎలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రుప‌లేదు. అదేంటి ప్ర‌తిప‌క్షంలో ఉన్నాకానీ ప్ర‌తీ నియోజ‌కవ‌ర్గానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిధులను కేటాయిస్తుంది క‌దా! మ‌ళ్లి ఎందుకు వీరు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేదు అనే ప్ర‌శ్న ప్ర‌తీ ఒక్క‌రికి వ‌స్తుంది.టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది కాబ‌ట్టి ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిధులు కేటాయించ‌టం లేద‌ని అంటున్నారు ప్ర‌తిప‌క్ష నేత‌లు
 
అయితే ఈ 20 మంది ఎమ్మెల్యేలు దాదాపు నాలుగు సంవ‌త్సరాలు పూర్తి అయినా ఇంత‌వ‌ర‌కూ ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మం చేయ‌లేదు. దీంతో క‌చ్చితంగా ఈ 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీనే గెలుస్తుంద‌ని ప‌చ్చ నాయ‌కులు కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు.
 
అయితే వారి కాల‌ర్ కు అమాంతంగా మ‌ర‌క‌లు అంటుకున్నాయి. దీంతో టీడీపీ నాయ‌కులు మ‌ర‌క‌లు తొల‌గించుకునేందుకు రిన్, స‌ర్ఫెక్స‌ల్ వంటి క్రిమి సంహార‌క స‌ర్ఫ్ లు వాడినా కూడా మ‌ర‌క‌లు పోవ‌డంలేదు. ఈ మ‌ర‌క‌లు పోవ‌డానికి కార‌ణం ప్ర‌జ‌లు వైయ‌స్సార్ హయాంలో ఈ 20మంది నిత్యం ప్ర‌జ‌ల ప‌క్షాన‌ నిలుస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ, ప్ర‌జ‌ల క‌ష్టమే త‌న క‌ష్టంగా భావించి వీరంద‌రూ ప్ర‌జ‌ల ప‌క్షాన‌ నిలిచారు. 
 
అభివృధ్దిని టీడీపీ అడ్డుక‌న్నా స‌రే వారే ఎమ్మెల్యేగా ఉంటే చాలు...వైసీపీ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ వైయ‌స్సార్ పాల‌న వస్తుంద‌నే ఆశ‌తో ప్ర‌జ‌లు ఈ 20 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను 2019 ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మెజారిటీతో గెలిపిస్తార‌ని స‌ర్వేలో తేలింది.
 
మ‌రి ఇంత‌లా ప్ర‌జాభిమానం పొందిన ఎమ్మెల్యేల‌ను తెలుసుకోవాల‌ని ఉందా అయితే చూడండి!
 
- వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి - పులివెందుల -క‌డ‌ప‌
- మేకా ప్ర‌తాప్ అప్పారావు - నూజివీడు - కృష్ణా
- కొడ‌లి నాని - గుడివాడ - కృష్ణా
- మేపాటి గౌత‌మ్ రెడ్డి ఆత్మ‌కూరు-గుంటూరు
- కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి నెల్లూరు రూర‌ల్-నెల్లూరు
- అనిల్ కుమార్ యాద‌వ్ -నెల్లూరు అర్బ‌న్‌
- కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి స‌ర్వేప‌ల్లి-గుంటూరు
- బుగ్గ‌న రాజేంద్ర‌ప్ర‌సాద్ రెడ్డి డోన్-క‌ర్నూల్
- వై. సాయిప్ర‌సాద్ రెడ్డి ఆదోని-క‌ర్నూల్
- వై విశ్వేశ్వ‌ర రెడ్డి ఉర‌వ‌కొండ‌-అనంత‌పురం
- పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పుంగ‌నూరు-చిత్తూరు
- గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి న‌ర‌సారావుపేట-గుంటూరు
- పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి మాచ‌ర్ల‌-గుంటూరు
- గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి రాయ‌చూటి-క‌డ‌ప‌
- రాచ‌మ‌ల్లు ప్ర‌సాద్ రెడ్డి ప్రొద్దుటూరు-క‌డ‌ప‌
- గౌరు చ‌రితా రెడ్డి పాణ్యం-క‌ర్నూల్
- చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి చంద్ర‌గిరి- చిత్తూరు
- ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌గిరి-గుంటూరు
- ముస్తాఫా గుంటూరు ఈస్ట్- గుంటూరు
- ర‌వీంద్ర‌నాధ్ రెడ్డి -క‌మ‌లాపురం-క‌డ‌ప జిల్లా

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.