అనంత‌పురం జిల్లాలో వైసీపీకి ఆ సీటు ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-14 15:18:28

అనంత‌పురం జిల్లాలో వైసీపీకి ఆ సీటు ఫిక్స్

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు హ‌యాం నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కు టీడీపీ కంచుకోట‌గా వ‌స్తున్న జిల్లా అనంత‌పురం జిల్లా. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.అయితే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయ‌గా అందులో టీడీపీ 12 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అంత‌పురం జిల్లాలో జాతీయ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీచేసిన అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు కూడా రాలేదు. 
 
ఇక్క‌డ ముఖ్యంగా గ‌మ‌నించిన‌ట్లయితే ఈ 14 నియోజ‌కవ‌ర్గాల్లో టీడీపీకి బ‌ల‌మైన‌ క్యాడ‌ర్ ఉన్న సెగ్మెంట్ ఉర‌వ‌కొండ‌. తెలుగు దేశం పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి సుమారు ఐదు సార్లు టీడీపీ త‌న ఆదిప‌త్యాని చూపించింది. అందులో టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 
 
ఇక ఈ జిల్లాలో మ‌రో ట్విస్ట్ ఏంటంటే టీడీపీ అధికారంలో లేన‌ప్పుడు కేశ‌వ్ త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై మూడుసార్లు అత్య‌దిక మెజారిటీతో గెలిచారు. కానీ 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే ఆ ఎన్నిక‌ల్లో కేశ‌వ్ మాత్రం త‌న ప్ర‌త్య‌ర్థి విశ్వేశ్వ‌ర రెడ్డి చేతిలో ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొన్నారు.
 
అయితే టీడీపీ త‌ర‌పున కీల‌క నేత‌గా ఉన్న ప‌య్యావుల కేశ‌వ్ కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ త‌ర్వాత కేబినెట్ హోదా కలిగిన మండలిలో చీఫ్ విప్ పదవి కూడా ద‌క్కించుకున్నారు కేశ‌వ్. దీంతో వ‌చ్చే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉర‌వ‌కొండ నియోజ‌కవ‌ర్గంలో కేవ‌శ్ మ‌రోసారి పోటీ చేస్తే ఈజీగా గెలుస్తార‌ని ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డం అంత ఈజీ కాద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
 
ఎప్పుడైతే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో భాగంగా ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చేరుకున్నారో అప్ప‌టినుంచి వైసీపీలో మ‌రింత జోష్ పెరిగింద‌నే చెప్పాలి. అంతేకాదు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌రత్నాల‌కు ప్ర‌జ‌ల‌లో ఎంతో మార్పు వ‌చ్చింద‌ట‌. ఈ నియోజ‌కవ‌ర్గంలో సుమారు ఐదు సార్లు గెలిచిన‌ ప‌య్యావుల ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేదు . దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేయ‌నున్న ప‌య్యావుల కేశ‌వ్ కు చెక్ పెట్టేందుకు ప్ర‌జ‌లు మ‌రోసారి ఎదురు చూస్తున్నార‌ని స‌మాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.